రేపు తాడేపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం

వైయస్‌ జగన్‌ నేతృత్వంలో గవర్నర్‌ను కలవనున్న శాసనసభ్యులు

చంద్రబాబుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు

ప్రత్యేకహోదా సాధనకు కలిసి పనిచేస్తాం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 

అమరావతి: చరిత్రలో కనీవినీ ఎరుగుని రీతిలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బలపర్చారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు  తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని  తెలిపారు.ఈ సమావేశంలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం పార్లమెంట్‌ సభ్యుల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రేపు మధ్యాహ్నం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో  హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలవడం జరుగుతుందన్నారు.

చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పారు:పార్థసారధి
 ఐదేళ్ల నుంచి చంద్రబాబు అండ్‌ టీం అబద్ధాలు చెబుతూ పచ్చ మీడియా సపోర్ట్‌తో ఆ తప్పులను కప్పిపుచ్చుకున్న గాని ప్రజలు వాస్తవాలు  గ్రహించి సరైన తీర్పు నిచ్చారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ ఐదేళ్ల నుంచి ఈ రాష్ట్రం కోసం, రైతులు,మహిళలు,విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల విశ్వాసంతో ఆయనకు పట్టాభిషేకం చేశారని తెలిపారు.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరతాయని అన్ని వర్గాలు భావించి ఆశ్వీరందించారని తెలిపారు.ప్రత్యేకహోదా కోసం కూడా కలిసి పనిచేస్తామన్నారు.

Back to Top