సీఎం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీలు తలెత్తుకొని తిరుగుతారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర
 

అమరావతి: దళితులు, గిరిజనులు, ముస్లింలు, బలహీనవర్గాలకు మేలు చేయాలనే తపనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు శాసనసభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్లో కనిపిస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ.. గత ప్రభుత్వం క్యాష్‌ అండ్‌ క్యారీ అనే సిద్ధాంతంతో డబ్బులు ఇచ్చి కాంట్రాక్టులు పట్టుకుపో అన్నట్లుగా వ్యవహరించిందన్నారు. కానీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలన్నీ సమాజంలో తలెత్తుకు తిరుగుతాయని చెప్పారు. అంబేడ్కర్‌ రాజకీయంగా, విద్యా పరంగా రిజర్వేషన్లు కల్పించారని, అదే తరహాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితులు పనులు చేసుకునేందుకు కూడా రిజర్వేషన్‌ కల్పించడం అభినందనీయమన్నారు.

తాజా ఫోటోలు

Back to Top