సత్ఫలితాలు ఇస్తున్న మద్యపాన నిషేదం అమలు

మద్యంపానం వల్లే అనేక అనర్థాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి

చంద్రబాబు పాలనలో ప్రతి కుటుంబం మద్యం బారిన పడింది

 ఎమ్మెల్యే విడదల రజిని

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అమలుతో సత్ఫలితాలు ఇస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. ఎక్సైజ్‌ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. మద్యపాన నిషేదం అమలులో ఇప్పుడు తీసుకువస్తున్న చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. గాంధీ మహాత్ముడు అంతటివారే అప్పట్లో స్పందించారు. ఒక గంట సేపు నేను  నేను భారత దేశ నియంత్రణ అధికారి అయితే దేశంలోన్ని అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తానని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. రీసెంట్‌ సర్వేలు పరిశీలిస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. అతి మద్యపానం వల్ల 28 శాతం మంది దెబ్బలు తగిలి చనిపోతున్నారు. మందుబాబులు మద్యం మత్తులో ఇతరులతో తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, తమను తాము గాయపరుచుకుంటు మరణాలకు కారణమవుతున్నారు. నిండు ప్రాణం పోతుంటే  మనం ఎలా ఉహించగలుగుతాం. మద్యం  ఎక్కువగా తాగడం వల్ల 2016లో ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానమే కారణం. ఇటీవల ఓ ఆరోగ్యపత్రిక తన నివేదికలో ఇలా పేర్కొంది. రోజు మద్యం తాగితే రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు ముప్పు తప్పదని ఈ పత్రిక తెలిపింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఒక సర్వే నిర్వహించింది. అందులో రోజుకు ఒకటి, రెండు పెగ్గులు  తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15 శాతం పెరుగుతుందని ఆ సర్వేలో తేల్చారు.  రోజుకు నాలుగు పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35 శాతానికి చేరుతుందట. రగ్గర్స్‌ సైన్స్‌ యూనివర్సిటీ అతిగా అదేపనిగా మద్యం తాగే వ్యక్తులపై ఓ పరిశోధన చేసింది.  మందుబాబుల జన్యువుల్లో ప్రమాదకరమైన మార్పులు వస్తున్నట్లు  అందులో తేలిందట. 
ఏపీలో ఇటీవల ఓ అధ్యాయనం చేశారు. దేశంలో దాదాపు 16 కోట్ల మందికి మద్యం అలవాట్లు ఉన్నట్లు తేలింది.  అందులో 3 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారు. వీరులో ఆరు శాతం మంది ఏపీలో ఉన్నారట. ఇది మనకు నిజంగా దుర్వార్తే. దేశంలో మద్యం తాగే వారిలో పరిగణలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మద్యం తాగుతున్నారని ఇండియన్‌ ఇన్‌ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చెప్పింది. మద్యం వినియోగంలో గతంలో ఉమ్మడి ఏపీ నంబర్‌ వన్‌గా ఉండేది.ఏపీలో మద్యం తాగే వ్యక్తి సగటున ఏడాదికి 34.5 లీటర్ల ఆల్కహాల్‌ తాగుతున్నట్లు తేలింది.   
మద్యంపై మన రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలు పరిశీలిస్తే..
2017 డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రుకు చెందిన 55 ఏళ్లకు చెందిన వరలక్ష్మి, దాదాపు మరో 25 మంది మహిళలు ..తమ ఊర్లో మద్యం దుకాణాలు నిర్వహించడానికి వీల్లేదని ఆందోళన చేపడితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఆ మహిళలు చేపల చెరువుల్లో దూకారు. ఇవాళ ఆ ఊరు చుట్టుపక్కల మద్యం దుకాణం లేదు. ఈ గ్రామంలో అప్పట్లో 16 రోజుల పాటు నిరసన తెలిపారు. ఇందులో దాదాపు 400 మంది మహిళలు పాల్గొన్నారు. ఇదే జిల్లాలోని చివటంలోనూ అచ్చాయమ్మ2019లో చేపట్టిన ఉద్యమం కారణంగా దాదాపు 10 బెల్ట్‌ దుకాణాలు మూతపడ్డాయి. 
గోరేటి వెంకన్న పాడిన పాట పల్లె కన్నీరు పెడుతుందో అన్న చంద్రబాబు పాలన గమనిస్తే గుర్తుకు వస్తుంది.  చంద్రబాబు పాలనలో మద్యం బారిన పడి ప్రతి కుటుంబంలో కన్నీరు గోడు ఉంది. 1994 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ సంపూర్ణ మద్యపాన నిషేదం నినాదంతో విజయం సాధించింది. అప్పట్లో మహిళలు చేసిన తొలి పొరపాటు కారణంగా ఎన్టీఆర్‌ సీఎంగా తొలి సంతకం మద్యపాన నిషేదం ఫైల్‌పై పెట్టారు. అయితే ఆయన్ను గద్దె దింపి దొడ్డిదారిలో సీఎం పదవి దక్కించుకున్న చంద్రబాబు మద్యం నిషేదాన్ని ఎత్తేశారు. టీడీపీ హయాంలో జరిగిన అత్యాచార కేసుల్లో 90 శాతం నిందితులు మద్యం మత్తులోనే ఉన్నారు. అప్పట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి దాటాక మద్యం విక్రయాలు చేపట్టినా పట్టించుకోలేదు.  టీడీపీ పాలనలో మంచి నీరు దొరకదు..మద్యం మాత్రం ఏరులై పారుతుందన్న నానుడి ఉంది.  ఆరోగ్యానికి సారా హానీకరం. మద్యపానం వల్ల రాష్ట్రం ఎంత ఆందోళనకరంగా ఉందో మన సీఎంకు తెలుసు. నిరంతరం రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పరితపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానం విజయవంతమైంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ దుకాణాలద్వారానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌పై నిషేదం, ఎంఆర్‌పీ కంటే అధికధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు. ఒక వ్యక్తికి గరిష్టంగా మూడు బాటిళ్ల విక్రయం, ఎక్కువ బాటిల్స్‌ ఎవరి వద్దనైనా దొరికితే కఠిన చర్యలు అన్న నిర్ణయం మందుబాబులకు శాపంగా మారింది.  రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్‌ షాపులు లేవు. కేవలం ఆరు నెలల కాలంలోనే మద్యం విషయంలో మన ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఇది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 మంది మహిళా కానిస్టేబుళ్లను మన ప్రభుత్వం నియమించడం హర్షనీయం.మద్యపాన నిషేదంపై మనం వేస్తున్న అడుగులకు సత్ఫలితాలు వస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో 29 లక్షల 62 వేల కేసుల లిక్కర్‌ను ఏపీలో విక్రయించగా, ఈ ఏడాది నవంబర్‌లో 22 లక్షల, 31 వేల లిక్కర్‌ను విక్రయించారు. 24 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్ల అమ్మకాల్లో 2018 నవంబర్‌లో 17 లక్షల 88 వేల కేసులు అమ్ముడపోగా ఈ ఏడాది నవంబర్‌లో 8 లక్షల 13 వేల కేసులు మాత్రమే విక్రయించారు. రాష్ట్రంలో 54 శాతం బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి.

 

Back to Top