లోకేష్‌కు విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: నారా లోకేష్‌కు విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మూడు శాఖలకు మంత్రిగా లోకేష్‌.. విజయవాడ నగరానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో 10 శాతమైనా గతంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. తనకు ఓటెయ్యకపోతే అన్నీ కట్‌ చేస్తానని నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబు అన్నాడని గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ మాత్రం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. స్వేచ్ఛ సురక్షలో విజయవాడ నగరం మూడో ర్యాంకులో ఉందని, విజయవాడకు ర్యాంకు రావడం టీడీపీకి ఇష్టం లేదన్నారు. 
 

Back to Top