తప్పు చేసిన అయ్యన్నను అరెస్టు చేస్తే కుల రాజకీయాలా..?

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్

అయ్యన్న నేరానికీ, బీసీలకు ఏం సంబంధం..?

ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా..?

 బీసీల తోకలు కత్తిరిస్తానన్నవారు బీసీ అనుకూలురు అవుతారా..?

విశాఖ‌: తప్పు చేసిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేస్తే కుల రాజకీయాలా..? అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్ర‌శ్నించారు.  గత మూడున్నరేళ్లగా కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్టు చేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? నేనూ బీసీ నాయకుడినే .. నేను తప్పు చేస్తే అరెస్టు చేయరా? టీడీపీ నాయకులు రోడ్లమీదకు వచ్చి బీసీ నేతను అరెస్టు చేశారని కుల రాజకీయం మొదలుపెట్టారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టడమే కాకుండా, ఆ స్థలానికి చెందిన డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారని అరెస్టు చేస్తే, దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్న టీడీపీ నాయకులు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే శ్రీ ఉమ శంకర్ గణేష్ మీడియాతో మాట్లాడారు.

రౌడీ రాజకీయం, కక్ష సాధింపు రాజకీయం చేసింది టీడీపీ హయాంలోనే. ఈ మూడున్నరేళ్ల కాలంలో అయ్యన్నపాత్రుడుపై సుమారు 9 నుంచి 10 కేసులు వరకూ ఉన్నాయి. వాటికి కారణాలు చూస్తే.. పోలీసుల్ని బట్టలు ఊడతీసి కొడతా అంటే కేసులు పెట్టరా?, మహిళా ప్రభుత్వ అధికారిని దుర్భాషలాడితే కేసు పెట్టరా? ఒక కులాన్ని దూషిస్తూ నీచంగా మాట్లాడితే కేసు పెట్టరా?  కేవలం అయ్యన్న నోటి దురుసు, అక్రమాలు, తప్పుడు పనులపైన మాత్రమే కేసులు పెట్టారే తప్ప ఎక్కడా కక్ష సాధింపు లేదు. దీనికి టీడీపీ కుల రాజకీయాలు చేస్తుంది. 

  •  ఇరిగేషన్ శాఖకు చెందిన పంట కాలువ స్థలాన్ని ఆక్రమించుకుని, దానికి సంబధించిన ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ సృష్టించి, తప్పుడు పత్రాలను ఏకంగా హైకోర్టుకు సమర్పించిన వ్యక్తిని ఆధారాలతో సహా అరెస్టు చేస్తే.. ఆ అరెస్టును సమర్థించే వారిని మీడియా అనాలా, ఆ అరెస్టును సమర్థించే వారిని ఒక రాజకీయ పార్టీ అనాలా, దీన్ని ఏమనాలి..?
  •  పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో అరెస్టుకు కారణాలను స్పష్టంగా చూపారు. ఏ కారణాల వల్ల నాన్ బెయిల్ బుల్  అరెస్టు చేస్తున్నారో స్పష్టంగా చెప్పారు. 
  •  అయినా అరెస్టు చేయడానికి వీల్లేదని ఎలా అంటారు..?
  •  అరెస్టు సమయంలో అయ్యన్నపాత్రుడి వీడియోలు చూస్తే.. ఒక మాఫియా డాన్ ఎప్పుడూ గూండాలను చుట్టుపెట్టుకుని, ఒక డెన్ లో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. 
  •  ఒక మాఫియా డాన్ పోలీసులను చూసి, ఎలా బెదిరిస్తాడో, అలాగే బెదిరించాడు.
  •  పోలీసులను మీ అంతు చూస్తాను అని బెదిరించినవాడిని చట్టానికి కట్టుబడ్డ వ్యక్తి అంటారా.. లేక.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారా..?

 అయ్యన్న నేరానికీ, బీసీలకు ఏం సంబంధం..?

  •  ఈ నేరానికీ, తమకూ సంబంధం ఉందని టీడీపీ చెబుతోంది. 
  •  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతున్నది జగన్ గారి ప్రభుత్వంలో మాత్రమే అన్న నిజం బీసీలు గమనించారు. మిగతా సామాజిక వర్గాలు కూడా గమనించాయి. 
  •   ఇంగ్లీషు మీడియం వద్దన్నవారు, ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడిన వారు, బీసీల పక్షపాత వ్యక్తులు అవుతారా..?
  •  బీసీల తోకలు కత్తిరిస్తానన్నవారు బీసీ అనుకూలురు అవుతారా..?
  •  డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ అని మాట్లాడినవారు బీసీలను సమర్థించినట్టా...?
  •  గంజాయి వ్యాపారి చట్టబద్ధ వ్యాపారస్థుడు అవుతాడా..?
  •  ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా..?

 దొంగ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు తారుమారు చేసిన వ్యక్తి దేశ భక్తుడా లేక తెలుగుదేశం భక్తుడా..?

  •  ఒకప్పుడు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వారికి ఇలాంటి దొంగ పనులు చేయవచ్చు అని లైసెన్స్ ఇచ్చారా..?
  •  టీడీపీ వారికి భారత, ఏపీ చట్టాలు వర్తించవా..?
  •  టీడీపీ వారికి ఈ దేశంలో న్యాయం, రాజ్యాంగం వర్తించవా..?

 ధూళిపాళ్ళ నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా.. వీరంతా సంఘ సేవకులా.. లేక.. రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులా..?

  •  వీరిని అరెస్టు చేస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్టా..?. ఇంత దుర్మార్గమా..?
  •   పైగా దీన్ని సమర్థించడానికి ఎల్లో మీడియానా..?
  •   ఆయన కొడుకు చేతిలోనే టీడీపీ సోషల్ మీడియానా..?
  •  ఇవన్నీ చూస్తే టీడీపీ అంటే.. తెలుగుదేశం పార్టీనా..? లేక తెలుగు దొంగల పార్టీనా..?
  •  ఈ దొంగతనాన్ని సమర్థించే పత్రికలు, టీవీలు.. దొంగ పత్రికలూ, దొంగ టీవీలా.. లేక, వీరు జర్నలిజంలో భాగమా..?.. అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  ఉమ శంకర్ గణేష్ ప్రశ్నించారు.
Back to Top