రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  
 

అనంత‌పురం: రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. చీకటి ఒప్పందాలన్నారు.  రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని.. లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు పెట్టేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. 
 
 పరిటాల సునీత సివిల్ సప్లై మినిస్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టేందుకు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారని.. అమరావతి నిర్మాణం చేయకుండా చంద్రబాబు తన చాతుర్యంతో ప్రజలని భ్రమలో పెట్టారని చురకలు అంటించారు. నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు అని.. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చామన్న భ్రమలు కల్పించారని.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ జిల్లా టీడీపీ నేతలు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదని.. అవి చీకటి ఒప్పందాలు అని ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top