కే వైరస్‌ సోకిన వ్యక్తులు చంద్రబాబుకు సహకరిస్తున్నారు

చంద్రబాబు కుటిల రాజకీయాలు, కుట్రలు చేస్తున్నారు

అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే చంద్రబాబు నైజం

వైయస్ఆర్‌సీపీ తప్ప అన్ని పార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు

తాడేపల్లి: కే వైరస్‌ సోకిన వ్యక్తులు చంద్రబాబుకు సహకరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం ప్రజాస్వామ్యానికి విపత్తు అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజమన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం ఒక విపత్తుగా వైయస్‌ఆర్‌సీపీ భావిస్తోంది. ఇది కే..వైరస్‌. ఈ వైరస్‌ సోకి 40 ఏళ్లు దాటింది. ఈ వైరస్‌ను ఎన్టీఆర్‌పై రుద్దాలని చూశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు నైజం. కరోసా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. నారా చంద్రబాబు కే వైరస్‌ సోకినటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలో, పాలన వ్యవస్థల్లో ఉన్నారు. అనేక చోట్ల ఇలాంటి వ్యక్తులు కూర్చొని చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అవుతున్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ కుట్రపూరితమైన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. చంద్రబాబు అడిందే ఆటగా కొందరు దళితులను, మైనారిటీలను, కుల పిచ్చిగాళ్లను వాడుకుంటున్నారు. రాజ్యాంగపరమైన హక్కులు చంద్రబాబు పాలనలో రాణించారా? ఏ రోజైనా ఆదుకున్నారా?. చంద్రబాబు నాలుగు గ్రామాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రిగా మారారు. భ్రమరావతి అంటూ ఊహా లోకంలో విహరిస్తూ..కృత్రిమ ఉద్యమంతో బొక్కబోర్ల పడ్డారు. మా నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాలుగు జెడ్పీటీసీల్లో మూడు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. చంద్రబాబు కుట్రలను గమనించిన ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలు మా నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు పలికారు. కరణం బలరాం వంటి నేతలు వైయస్‌ జగన్‌కు మద్దతు పలకడం శుభపరిణామం. కే వైరస్‌ పట్టిన వారిని పత్రికాధినేతలను, వ్యవస్థల్లో పని చేసే వారిని చంద్రబాబు వాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కోర్టుకు వెళ్తారు. శాసన సభ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కే వైరస్‌ సోకిన శాసన మండలిని వాడుకున్నారు. నారా చంద్రస్వామ్యంలో..మీరు రాసుకున్న రాజ్యాంగంలో భాగమై ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం. మీకు వచ్చిన నష్టం ఏంటి? కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను అడ్డుకొని ప్రజలను తీరని ద్రోహం చేశారు. ఎన్ని తిట్లు తిట్టినా మీరు అర్హులు. వైయస్‌ జగన్‌ సారధ్యంలో నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ధీటైన నాయకులుగా ఎదుగుతున్నాం. మీరు మాత్రం అడ్డదారిలో వస్తున్నారు. అందరిని మేనేజ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కే వైరస్‌ సోకిన అధికారుల సమూహాన్ని వాడుకొని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. చంద్రబాబు నైజం ఇదే. చంద్రబాబు ఎప్పుడూ కూడా ఎన్నికలకు ఒంటరిగా వచ్చింది లేదు. వైయస్‌ఆర్‌సీపీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. ఎలా దోచుకోవాలి? ఎలా దండుకోవాలి? ప్రజలను ఎలా మోసం చేయాలన్నదే చంద్రబాబు అనుభవం. ఎన్నికల కమిషన్‌ను అడ్డుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పేర్కొన్నారు.   

Back to Top