శుక్రవారమే ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి దొరికిపోయాడు

డాక్టర్‌ సుధాకర్‌ నీచ ప్రవర్తన చంద్రబాబు కుట్రలో భాగమే

యాక్షన్‌ ప్లాన్‌ టీడీపీ ఆఫీస్‌లోనే రెడీ అయ్యింది

దళితులంతా ఏకమై చావుదెబ్బకొట్టినా బాబుకు బుద్ధిరాలేదు

సీఎంపై అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తికి రక్షణ కల్పించాలని లేఖ రాయడం దిగజారుడుతనం  

దళిత్‌ అనే పదాన్ని వాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజం

తాడేపల్లి: డాక్టర్‌ సుధాకర్‌ తప్పతాగి రోడ్డు మీద వీరంగం సృష్టించడం చంద్రబాబు కుట్రలో భాగమేనని, ఇందుకు టీడీపీ కార్యాలయం నుంచి వెలువడిన ప్రెస్‌నోట్‌ నిదర్శనమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఏ రోజు డాక్టర్‌ సుధాకర్‌ యాక్షన్‌ స్క్రిప్టు రాశారో.. ఆ రోజే ఖండన ప్రెస్‌నోట్‌ కూడా టీడీపీ ఆఫీస్‌ నుంచి రిలీజ్‌ అయ్యిందన్నారు. సంఘటన శనివారం జరిగితే.. శుక్రవారమే డాక్టర్‌ సుధాకర్‌ను రక్షించాలని చంద్రబాబు ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల మతిస్తిమితం కోల్పోయిన డాక్టర్‌ సుధాకర్‌ నోటికొచ్చినట్లుగా అసభ్యకరంగా మాట్లాడితే.. దాన్ని ఖండించాల్సిందిపోయి.. డాక్టర్‌కు రక్షణ కల్పించాలని చంద్రబాబు లేఖ విడుదల చేయడం బాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్‌ సుధాకర్‌ ఎలా మాట్లాడాలి.. సీఎం పట్ల ఎలా అసభ్యకరంగా మాట్లాడాలనే స్క్రిప్టు టీడీపీ కార్యాలయంలోనే తయారైందన్నారు. చంద్రబాబు దళితులను ఏ విధంగా వాడుకుంటున్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనమన్నారు. చంద్రబాబు తన జీవితకాలం దళిత్‌ అనే పదాన్ని వాడేందుకు నైతిక అర్హత లేదు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడినప్పుడే దళితులపై ఉన్న కపటప్రేమ బయటపెడింది. ఎన్నికల్లో దళితులు చావుదెబ్బకొట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదు.

డాక్టర్‌ సుధాకర్‌ పీకలదాకా మందు తాగి ఏ విధంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనించాలి. డాక్టర్‌ సుధాకర్‌ను ఆ విధంగా తయారు చేసి రోడ్డు మీదకు వదిలిన నారా చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదో సమాధానం చెప్పాలి. డాక్టర్‌ సుధాకర్‌ కోసమేనా చంద్రబాబు లేఖ రాసింది. అసభ్యకరంగా మాట్లాడిన సుధాకర్‌ మంచివాడని, రక్షించాలని బాబు కోరుతున్నాడు. సీఎంపై అసభ్యకరంగా మాట్లాడితే దాన్ని ఖండించాల్సిందిపోయి మాట్లాడిన వ్యక్తిని రక్షించాలని లేఖ రాస్తావా..? చంద్రబాబుకు నిజంగా సిగ్గులేదు.

చంద్రబాబు రాసిన లేఖను అడ్డంపెట్టుకొని మాజీ మంత్రి నక్క ఆనంద్‌బాబు నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నాడు. నక్క ఆనంద్‌బాబుకు, చంద్రబాబుకు సిగ్గుండాలి. దళితులను కించపరిచిన సమయంలో చంద్రబాబును నక్క ఆనంద్‌బాబు వ్యతిరేకించి ఉండాలి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని దళితులను కించపరిచేలా మాట్లాడినప్పుడు ప్రేమ ఏమైంది. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు కూడా అధికారం చేజారిపోయాక పిచ్చివాడైపోయాడేమోనని అనుమానం వస్తుంది' అని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు అన్నారు. 

Back to Top