ఆ లేఖను ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి..?

సీబీఐ ఆ లేఖను మరణ వాంగ్మూలంగా ఎందుకు తీసుకోలేదు..?

టీడీపీ హయాంలోనే వైయస్‌ వివేకా హత్య జరిగింది

ఆరోజు ఉన్న పెద్దవారు ఎవరు..? ఆరోజు ఉన్న ప్రభుత్వం ఎవరిది..?

చంద్రబాబు,  న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి

ఆ అవసరం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకే ఉంది

సీబీఐ ఎందుకు వారిని విచారణ చేయడం లేదు..?

గంగిరెడ్డి చెప్పినట్టుగా ఆయన వెనకున్న పెద్దవారు ఎవరు..?

నిష్ప‌క్షపాతంగా దర్యాప్తు జరగాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారు

చంద్రబాబు,  న‌ర్రెడ్డి మధ్య సంభాషణలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాం..

2011లో వైయస్‌ జగన్‌పై జరిగిన కుట్రే.. మళ్లీ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

 తాడేపల్లి: వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం వైయస్‌ జగన్‌ కుటుంబీకులకు ఆపాదించాలని, వీలైతే సీఎం వైయస్‌ జగన్‌పై కూడా నిందలు వేయాలని ప్లాన్‌ ప్రకారం కుట్ర జరుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే.. విచారణలో ఏ విషయాల పట్ల సీబీఐ ఎంక్వైరీ చేస్తుందో వాటిని ప్రచురింపజేయడం, మీడియాలో మాట్లాడించడం ఇవన్నీ చూస్తే బాధితులనే నిందితులుగా చేసే కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుందన్నారు. 

వైయస్‌ వివేకా భౌతికకాయం పక్కన పడి ఉన్న లేఖ, సెల్‌ఫోన్‌ను ఆయన అల్లుడు న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాచి ఉంచమని చెప్పాడో దానిపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ లేఖపై టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడటం లేదు..? లేఖ దాచిపెట్టమని న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు చెప్పాడు..? దాచి ఉంచమని న‌ర్రెడ్డికి చెప్పింది ఎవరూ..? ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటీ..? ఆయన వెనకున్న పెద్దవారు ఎవరు..? సీబీఐ ఎందుకు ఆ లేఖను మరణ వాంగ్మూలంగా పరిగణించడం లేదు..? సీబీఐ ఎందుకు ఆదినారాయణరెడ్డి, చంద్రబాబు, బీటెక్‌ రవి, న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్‌ కాల్స్‌పై దృష్టిపెట్టడం లేదు..? అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అవాకులు, చవాకులు పేలుతున్నాడు. టీడీపీ అధికారంలో ఉండగా 2019 మార్చి 15న వైయస్‌ వివేకా హత్య జరిగింది. టీడీపీ ప్రభుత్వం, తమ ఆధీనంలో ఉన్న పోలీస్‌ విభాగం చేసిన దర్యాప్తులో ఏం తేల్చగలిగింది. అమిత్‌ నేతృత్వంలో దాదాపు 25 మందితో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను వేసి 80 రోజుల కాలంలో ఏం తేల్చగలిగారు..? ఎవరి మీద నిందలు వేయగలిగారు.. ఎవరిని ముద్దాయిలుగా చూపగలిగారు..?

ఆరోజు ఉన్న ప్రభుత్వం ఎవరిది..?
ఆరోజు కొల్లు శ్రీనివాసులు ప్రొద్దుటూరు డీఎస్పీ, ఎస్బీ డీఎస్‌పీ చారి, అమిత్‌ ఖాన్, సాదిక్‌ అలీ, ప్రభాకర్‌ గౌడ్, శ్రీరామ్‌ ఇలా ఎంతో మంది అధికారులు ఎన్ని విధాలుగా  హింసించినా ముద్దాయిలు అనబడే వ్యక్తులు ఏమీ చెప్పలేదని వార్తల్లోనూ రావడం జరిగింది.  ఎర్ర‌ గంగిరెడ్డి హంతకుడని ఈరోజు నిర్దారణ చేయబడిన వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం.. ఎర్ర‌ గంగిరెడ్డి చెప్పాడు.. పైన పెద్దోళ్లు ఉన్నారు. వారంతా మనల్ని కాపాడుతారు. కాబట్టి ధైర్యంగా హత్య చేయమని చెప్పాడని ఒక స్టేట్‌మెంట్‌ చూస్తున్నాం. ఆరోజు ఉన్న పెద్దవారు ఎవరు..? ఆరోజు ఉన్న ప్రభుత్వం ఎవరిది..? చంద్రబాబు ముఖ్యమంత్రి, జిల్లాలో ఆదినారాయణరెడ్డి మంత్రి.

ఆ లేఖ విషయాన్ని ఆదినారాయణరెడ్డి ప్రస్తావించాడు..
ఆరోజు ఉన్న పెద్దలు చంద్రబాబు, బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి వైయస్‌ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు. వివేకానందరెడ్డికి కుటుంబ కలహాలు ఉన్నాయి. ఆయన అల్లుడు న్రరెడ్డి రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డికి పొరపచ్చాలున్నాయి. వివేకానందరెడ్డి రెండో వివాహం విషయంలో, ఆస్తులను రెండో కుటుంబానికి ఇస్తాడన్న అనుమానాలు అల్లుడు న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన ఆదినారాయణరెడ్డితో సంబంధాలు ఏర్పరుచుకోవడం, అదే విధంగా హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి హత్య జరిగింది.. భౌతికకాయం పక్కన లేఖ, ఫోన్‌ కూడా పడి ఉందని చెబితే.. ఆ లేఖను, ఫోన్‌ను దాచి ఉంచమని న్రరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పాడు. ఇదే విషయాన్ని బహుశా ఆదినారాయణరెడ్డికి సమాచారం ఇచ్చాడేమో.. 8 గంటలకు ఆ లేఖ విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. 

ఆయన వెనకున్న పెద్దవారు ఎవరు..?
ఆ లేఖ విషయంపై ఎందుకు టీడీపీ పెద్దలు, ఎల్లో మీడియా మాట్లాడటం లేదు. ఎందుకు దాచిపెట్టమని న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పాడు..? ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటీ..? ఆ లేఖను దాచిపెట్టమని న్రరెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పింది ఎవరూ..? ఆయన వెనకున్న పెద్దవారు ఎవరు..? సీబీఐ ఎందుకు ఆ లేఖను మరణ వాంగ్మూలంగా పరిగణించడం లేదు. సీబీఐ ఎందుకు ఆదినారాయణరెడ్డి, చంద్రబాబు, బీటెక్‌ రవి, న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్‌ కాల్స్‌పై దృష్టిపెట్టడం లేదు. వీరు నలుగురు కలిసి కుట్ర చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో.. ఈరోజు సీఐబీ వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమానికి ముగించడానికి మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. 

ఆ నలుగురి సంభాషణలు బయటపెట్టాలి..
నిజంగా ఆ పెద్దవారు ఎవరు..? చంద్రబాబే వైయస్‌ వివేకాను హత్య చేశారా అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. గంగిరెడ్డి ఆరోజున ఇచ్చిన వాంగ్మూలంలో పెద్దవారు ఉన్నారని చెప్పారంటే.. నిజంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారే కదా. వారిపై విచారణ ఎందుకు చేయడం లేదు.? వైయస్‌ వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న అధికారికి.. చంద్రబాబుకు, న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సంబంధించిన సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక..
వైయస్‌ఆర్‌ మరణం తరువాత ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక, వైయస్‌ఆర్‌ సంక్షేమ ఫలాలు వైయస్‌ జగన్‌ వెన్నంటే నడుస్తాయన్న భయంతో ఏ విధంగా ఆరోజున సీబీఐని తెరమీదకు తెచ్చారో.. మళ్లీ అదే విధంగా సీబీఐ అనే సంస్థ విచారణలోకి వచ్చి.. తాజా పరిణామాలు చేసిన తరువాత కుట్ర జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆ కోణంలో ఎందుకు విచారణ చేయడం లేదు..
న్రరెడ్డి రాజశేఖరరెడ్డి గతంలో కూడా వివేకానందరెడ్డి ఆస్తికి వారసుడు కావాలనుకొని ఆయన రాజకీయ జీవితాన్ని తన చేతుల్లో పెట్టుకొని తప్పుదోవ పట్టించాడు. వివేకానందరెడ్డి రెండో భార్య సంతానికి ఆస్తి ఎక్కడపోతుందనే భయంతో న‌ర్రెడ్డిని ముందుపెట్టి చంద్రబాబు చేయించాడని ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నిస్తున్నా. 

సీబీఐ విచారణ కోరితే.. చంద్రబాబు సిట్‌ వేశారు..
నోటికి వచ్చినట్టుగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. లోకేష్‌ బాబాయి రామ్మూర్తి నాయుడును ఏ విధంగా చూసుకుంటున్నారు..? సంకెళ్లు వేసి చీకటి గదిలో బంధించారని ప్రచారం జరుగుతుంది. అదే విధంగా తన బాబాయిని సీఎం చూసుకున్నారని భావిస్తున్నారా..? వివేకానందరెడ్డి లోకేష్‌కు బాబాయా..? సీఎం వైయస్‌ జగన్‌కు బాబాయా..? తన తండ్రి తమ్ముడు మరణిస్తే సీఎం వైయస్ వైయ‌స్ జగన్‌కు ఎంత బాధ ఉంటుందో ఆయనకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. వివేకా హత్య కేసులో దోషులు బయటపడాలని ఆరోజే సీబీఐ విచారణ కోరితే.. చంద్రబాబు సిట్‌ వేశారు. హంతకులు బయటకురాకుండా చంద్రబాబు కాపాడారు. వైయస్‌ఆర్‌ సీపీ వారిని ముద్దాయిలుగా చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. 

ఇన్నాళ్లూ తన వెనకున్న పెద్దవారిని ముందుకు తీసుకువస్తున్నాడు..
కేసు నిస్పక్షపాతంగా విచారణ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మొదట్నుంచి కోరుతున్నారు. సునీతమ్మ కోరిన వెంటనే కేసును సీబీఐ విచారణకు అప్పగించారు.  చంద్రబాబు చెప్పుచేతుల్లోకి న‌ర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతమ్మ చేరిన తరువాత ఇన్నాళ్లూ తన వెనకున్న పెద్దవారిని ఈరోజు బహిరంగంగా న్రరెడ్డి ముందుకు తీసుకువస్తున్నాడు. అవకాశం ఉంటే సీఎం వైయస్‌ జగన్‌పై పోటీ చేస్తానని 2011లో న్రరెడ్డి మాట్లాడాడు. మళ్లీ 11 సంవత్సరాల తరువాత అటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే.. నిజంగా హత్య చేయించింది చంద్రబాబా..? చేసింది న్రరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీబీఐ తప్పకుండా ఆకోణంలో కూడా విచారణ చేయాలి. ఆ లేఖ ఎందుకు దాచిపెట్టారు.. దాచిపెట్టాలని ఎందుకు చెప్పారో విచారణ చేయాలి. 

ఆ అవసరం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకే ఉంది
హత్యకు కారణాలు ఏమున్నాయి..? ఆరోజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో, కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న  తరుణం. ఆ సమయంలో వివేకానందరెడ్డిని హత్య చేసి.. దాన్ని వైయస్‌ కుటుంబీకులు చేశారని నిందమోపి.. ఆ నిందను గోబెల్స్‌ ప్రచారం చేసి లబ్ధిపొందాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకే ఉంది. ఇందులో వైయస్‌ అవినాష్‌రెడ్డి, వైయస్‌ భాస్కర్‌రెడ్డి పేరు చెప్పాలని సాక్షులను బెదిరించడం, సాక్షులను ముద్దాయిలుగా మార్చడం చూస్తుంటే.. 2011లో ఏర్పడిన ఒక విషకూటమి.. ఆరోజు వైయస్‌ జగన్‌పై ఏ విధంగా బురదజల్లిందో.. అటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది. 

తమ పార్టీ ఉనికి నిలబడుతుందనే భ్రమలో టీడీపీ..
సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాల వెల్లువలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో టీడీపీ లేదు. కేవలం సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయగలిగితే తమ పార్టీ ఉనికి నిలబడుతుందనే భ్రమలో టీడీపీ నేతలు ఉన్నారు. తాము ఏది చెప్పినా రాష్ట్ర ప్రజలు గుడ్డిగా నమ్ముతారనిచంద్రబాబు కుట్ర చేస్తున్నారు. తన బాబాయి హత్యను ఎవరు చేశారో తెలుసుకోవాలని సీఎం స్పష్టంగా కోరుతున్నారు. లేఖకు సంబంధించిన విషయాన్ని ప్రధానంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నార‌ని ఎమ్మెల్యే ప్ర‌కాశ్ రెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top