అనంతపురం: వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకుందామని వైయస్ఆర్సీపీ మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. వైయస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చి..వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే మన బాధ్యత అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలు పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
పొట్ట కూటి కోసం మన జిల్లా వాసులు బెంగుళూరు, బళ్లారి వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పారు. బూత్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు అప్రమత్తమై పార్టీకి ఓట్లు వచ్చేలా, అత్యధిక మెజారిటీ తెచ్చేలా కృషి చేయాలన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో వంచించని వర్గం లేదన్నారు .ప్రతి ప్రాంతానికి మోసం చేశారన్నారు. దళిత వ్యక్తిగా మాట్లాడుతున్నానని..గత ఎన్నికల్లో చంద్రబాబు దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.సబ్ ప్లాన్ డబ్బులు ఇతర కార్యక్రమాలకు మళ్లించి మోసం చేశారన్నారు. టీడీపీ అవినీతిని ఎదురించాల్సిన అవసరం ఉందన్నారు.