వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

ఏపీ రాజకీయాల్లో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు

పోలీస్‌ వ్యవస్థను వాడుకుని చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు

వైయస్‌ఆర్‌సీసీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు: అధికారులు,ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని వైయస్‌ఆర్‌సీపీ నేత  ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు.తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్‌ చేసి వారిని రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసునన్నారు.ఇంటెలిజెన్స్‌ అధికారిగా ఉండి రాష్ట్ర  రాజకీయాల్లో కీలకంగా వెంకటేశ్వరరావు వ్యవహరించారని తెలిపారు.వెంకటేశ్వరరావు దృష్టి మొత్తం రాజకీయంపై ఉండేదన్నారు.రాజకీయంగా రోజూ చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు బ్రీఫ్‌ చేసేవారన్నారు.ప్రభుత్వ పనితీరు,లా అండ్‌ ఆర్డర్‌పై కన్నా రాజకీయంగానే ఎక్కువ దృష్టి సారించేవారన్నారు.పార్టీ టికెట్‌ ఎవరికి ఇవ్వాలి,పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి,ఎవరిని పక్కన పెట్టాలన్నది నిర్ణయించేది వెంకటేశ్వరరావే అని తెలిపారు.అధికారులను టీడీపీ ఏవిధంగా మభ్యపెడుతుందో అందరికి తెలుసునన్నారు.పోలీస్‌శాఖను వాడుకుని ఎన్నికల్లో బాబు గెలవాలనుకున్నారని తెలిపారు.

Back to Top