టీడీపీ సభ్యులు సభలో రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు

ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాబుకు ఇంకా బుద్ధిరాలేదు

సీఎం వైయస్‌ జగన్‌ చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

అమరావతి: శాసనసభలో మాట్లాడనివ్వకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. టీడీపీ సభ్యులు సభలో రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. నిన్న బీసీ వర్గానికి సంబంధించిన స్పీకర్‌ను తాకుతూ సీట్లో నుంచి లేపే ప్రయత్నం చేశారని, ఈ రోజు ఉప సభాపతి మీదకు వెళ్లారన్నారు. ఇదంతా చంద్రబాబు వెనకుండి వారి సభ్యులతో నడిపిస్తున్నారన్నారు. ఐదేళ్లు చేసిన దుర్మార్గాలకు ప్రజలు బుద్ధి చెప్పి చంద్రబాబు పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధిరాలేదన్నారు.

సిగ్గురాని రాజకీయ వ్యవహార శైలితో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బతుకుల్లో మార్పు తీసుకురావాలని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వ్‌ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారన్నారు. చేతగాక 600ల హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేక బొక్కబోర్లాపడి.. ప్రతిపక్షంలో కూర్చొని రౌడీల్లా, వీధి గుండాల్లా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తుంటే.. వారిని అదుపు చేయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆనందంగా ముసిముసినవ్వులు నవ్వుతున్నాడని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రతి వాడకు తీసుకెళ్తామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బడుగు, బలహీనవర్గాల మేలు కోసం అడుగులు వేస్తున్నారని, దేశం మొత్తం ఆంధ్రరాష్ట్రంపై చూసేలా చేస్తున్నారన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top