వైయస్‌ జగన్‌ పాలనలో అన్నివర్గాలకు పెద్దపీట

ప్రజలందరూ సువర్ణ పాలన చూస్తారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకతోట సుచరిత

తాడేపల్లి:పారదర్శక పాలన చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకతోట సుచరిత అన్నారు.పాలనలో సమూల మార్పులు తీసుకురావాలనే దృఢనిశ్చయంతో సీఎం ఉన్నారన్నారు.ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతి జరిగింది. సామాన్య ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందలేని పరిస్థితి ఉందన్నారు.ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.అందుకే మళ్లీ దివంగత వైయస్‌ఆర్‌ సువర్ణ పాలన చూడాలనే ఉద్దేశ్యంతో ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టారని తెలిపారు.ప్రజల కోరుకున్న దిశగా వైయస్‌ జగన్‌ మార్కు పాలన చూపించడం జరిగిందన్నారు.రాబోయే రోజుల్లో నవరత్నా పథకాలు  ప్రతి ఇంటికి డోర్‌డెలీవరీ చేస్తారన్నారు.అన్నివర్గాల ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top