అందుకే పులివెందులకు ఆ పేరు పెట్టారు

జగనన్న గెలుపు..అభివృద్ధికి మలుపు

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

గుంటూరు: పేదల కష్టాలు తుడిచే నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్కడ పుడతారని ముందే తెలిసి పులివెందులకు ఆ పేరు పెట్టారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అభివర్ణించారు. వన మహోత్సవం సందర్భంగా డోకిపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రామికుల కష్టాలను తీర్చేందుకు వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. జగనన్న గెలుపు..అభివృద్ధికి మలుపు అన్నారు. అన్యాయానికి ఎదురు నిలబడే వ్యక్తులు, న్యాయానికి అండగా ఉంటే వ్యక్తులు, ఎవరికి కూడా రాజీ పడని వ్యక్తులు పులివెందుల బిడ్డ, కార్యకర్తల కన్నీరు తుడిచే వైయస్‌ జగనన్న అక్కడ పుడుతారని ముందే తెలిసి పులివెందుల పేరు పెట్టారని చెప్పారు. ఆడపిల్లలకు మొదట తండ్రి భరోసా ఇస్తారని, ఆ తరువాత అన్న భరోసా ఇస్తారన్నారు. జగనన్న మన నియోజకవర్గానికి రావడంతో మనకు భరోసా వచ్చిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే పేదలు అనే వారు లేకుండా చేసేవారు అన్నారు. వైయస్‌ఆర్‌ ప్రజల నుంచి పుడితే..జగనన్న ప్రజల గుండె చప్పుడు నుంచి పుట్టారని కొనియాడారు. అన్నా..నీవు తాడేపల్లిలో ఇళ్లు కట్టుకోవడమే కాదు..మా నియోజకవర్గ ప్రజల్లో గూడు కట్టుకున్నావని చెప్పారు. రాష్ట్రానికి దిశదశా మార్చే నాయకుడు  అధికారంలోకి వచ్చారు. తండ్రి ఒక అడుగు వేస్తే..రెండు అడుగులు వేసే నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. జనం..జగన్‌ రెండు కలగలిసి పోయారన్నారు. వన మహోత్సవం సందర్భంగా 1950లో ఈ కార్యక్రమం మొదలైందని, ఇప్పటికి 70 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. వృక్షో రక్షితః రక్షితి అంటారన్నారు.  మన నియోజకవర్గంలో జగనన్న వేప చెట్టు నాటారన్నారు. అది అమ్మవారి రూపమన్నారు. పిల్లలకు చికెన్‌ ఫాక్స్‌ వస్తే వేప ఆకులతో స్నానం చేయిస్తారన్నారు. మామిడి ఆకులు పండుగల సమయంలో ఇళ్లకు కట్టుకుంటారని చెప్పారు. బైబిల్‌లో కూడా ఏథెన్‌ వనం ఉంటుందన్నారు. ఒక్క మొక్క..పది మంది పిల్లలతో సమానమన్నారు. పచ్చని చెట్లు..ప్రగతికి మెట్లు అని తెలిపారు. 

 

Back to Top