అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి

బీసీజీ కమిటీ నివేదికలో సమాన అభివృద్ధి కోసం సూచనలు చేసింది

రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ సాధ్యం కాదన్న శివరామకృష్ణ కమిటీ

అభివృద్ధి చెందిన నగరాలతో పరిపాలన వికేంద్రీకరణ చేయాలని చెప్పింది

ఒకే ప్రాంతంలో అభివృద్ధితో ఆర్థిక అసమానతలన్న శ్రీకృష్ణ కమిటీ

వికేంద్రీకరణతో సమాన అభివృద్ధి అని శ్రీ కృష్ణ కమిటీ సూచనలు

చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూసి ప్రజలు కూడా మోసపోయారు

రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాలని బీసీజీ సూచనలు చేసింది

గత ప్రభుత్వం రూ.రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసింది

మరో లక్ష కోట్లు తెచ్చి అమరావతిలో పెడితే మిగిలిన ప్రాంతాలు అన్యాయమైపోతాయి.

చంద్రబాబు తప్ప వికేంద్రీకరణను అందరూ హర్షిస్తున్నారు

పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు

తాడేపల్లి: రాష్ట్రంలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుంటే అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని టీడీపీ నేతలు హర్షిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఇష్టం  ఉందా? లేదో స్పష్టం చేయాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజు ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
రాష్ట్ర పరిస్థితులను సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో తెలుసుకున్నారు. బీసీజీ కమిటీ నివేదికలో సమాన అభివృద్ధి కోసం సూచనలు చేసింది. 

రాష్ట్ర విభజన తరువాత కేంద్రం శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ప్రధాన కర్తవ్యం..దానికి గల వివిధ ప్రత్యామ్నయాలను అధ్యాయం చేయడం. అదే సమయంలో కొన్ని విషయాలను కమిటీ సూచించింది. ఉన్న వ్యవస్థలకు అతి తక్కువ భంగం కలిగే విధంగా కమిటీ రెకమొండేషన్‌ ఉండాలని కేంద్రం సూచించింది. ప్రాంతీయ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మీ సూచన ఉండాలని, స్థిరమైన అభివృద్ధి సాధ్యమయ్యేలా రాజధానిని సూచించాలని, ముఖ్యంగా ప్రకృతి వైఫరిత్యాలను కూడా అంచనా వేసి రాజధానికి రెకమెండేషన్‌ చేయాలని కేంద్రం ఈ కమిటీకి సూచించింది. నిర్మాణంలో మినిమమ్‌ పాసిబుల్‌ కనిష్టంగా ఉండాలి. భూ సేకరణ కనిష్ట స్థాయిలో ఉండాలని ఆరు సూచనలు ఇస్తూ ఆ రోజు శివరామకృష్ణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరు నెలల పాటు రాష్ట్రం మొత్తం తిరిగింది. ఒక మంచి రెకమొండేషన్‌ ఇచ్చింది. బీసీజీ కమిటీ రిపోర్టు అర్థం చేసుకోవాలంటే పాత రిపోర్టులు కూడా అధ్యాయనం చేయాలి. ఒక మహానగరం కట్టడం, దాన్నే రాజధాని చేయడం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ నిర్మాణం కాదు. ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక  అసమానతలు తలెత్తుతాయి కాబట్టి ఈ ఆప్షన్‌ అంత మంచిది కాదని శివరామకృష్ణ చెప్పారు. రెండో ఆప్షన్‌..ఉన్న పట్టణాలను విస్తృతీకరించి అక్కడే రాజధాని పెట్టుకోవడం. మూడో ఆప్షన్‌..ప్రభుత్వ కార్యాకలాపాలను వికేంద్రీకరించాలని సూచించింది. ఈ వికేంద్రీకరణలో భాగంగా ఆ రోజు కమిటీ చక్కని సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలో కొన్ని కార్యాలయాలు ఉండేలా, గుంటూరు, విజయవాడ ఏరియాల్లో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా, రాయలసీమకు సంబంధించి కాళహస్తి, నడికుడి ప్రాంతాల్లో కొన్ని కార్యాలయాలు ఉండే విధంగా చాలా చక్కనైన రెకమొండేషన్లు ఆ కమిటీ చేసింది.

ఆ రోజు చంద్రబాబుకు ఇవేవి పట్టలేదు. ఆయన సొంతంగా ఓ కమిటీ వేసుకున్నారు. ఆయన భజన పరులను, క్యాప్టలిస్టులు,   ఆయన వర్గం మనుషులతో ఓ కమిటీ వేసుకున్నారు. చంద్రబాబు అంతకుముందే నిర్ణయం తీసుకొని..ఆ కమిటీతో ముందుకు వెళ్లారు. అమరావతి అనే నగరాన్ని నిర్మిస్తామని ఊహల్లో, గ్రాఫిక్స్‌లు చూపుతూ టీవీల్లో విపరీతమైన ప్రచారం చేశారు. చంద్రబాబు నిజంగానే కట్టేస్తున్నారేమో? అమరావతి వెళ్తే పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉంటాయని, ఆకాశహర్మాలు గాల్లో ఎగురుతున్నాయన్న భ్రమల్లోకి ప్రజలను తీసుకొని వెళ్లిపోయారు. కానీ వాస్తవం వేరే ఉంది. ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేసింది ఏమిటీ? తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఎవరైన ఉన్న భవనాల్లో తాత్కాలిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  చంద్రబాబు మాత్రం రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడక్కడ అమరావతి అన్నది లేదే. కనీసం 25 శాతం మేర పురోగతి సాధించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. రాజధానిలో అవినీతి మూలలు కనిపిస్తున్నాయి. రైతులు సైతం వాళ్లకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వడం లేదని, కౌలు రైతులకు ఇవ్వాల్సిన పెన్షన్‌, పరిహారం  రాలేదని ఇప్పటికి గగ్గోలు పెడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వ్యవహారం నచ్చక మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మండమైన తీర్పు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో సైతం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. దాని అర్థం అమరావతి అన్నది చంద్రబాబే నిరోధించారన్న స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితిలో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం విడిపోయినప్పుడు  ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పటికీ కూడా రాజధాన్ని అన్నది లేదు. కేంద్ర ప్రభుత్వ మ్యాపులో ఇదే రాజధాని అని సూచించలేదు. ఇలాంటి పరిస్థితిల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజధానిపై, సమగ్రమైన అభివృద్ధిపై రెండు కమిటీలను నియమించింది. అందులో మొదటిది జీఎన్‌ఆర్‌ కమిటీ. ఈ కమిటీ సైతం చక్కనైన సూచనలు చేసింది. ప్రభుత్వ కార్యకలాపాలు, కార్యాలయాలు వికేంద్రీకరణ చేయమని సూచించింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యూడిషియల్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ సూచించింది. ఇదేదో వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పారు కాబట్టి ఆయన మాటలనే నివేదిక ఇచ్చింది కాదు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే..ఈ మధ్య కాలంలో విఫరీతంగా ప్రజల మనస్సుల్లో ఉన్న రెండు మాటలు..అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ. రాష్ట్రం ఏర్పడి సుమారు 63 సంవత్సరాలు అయ్యింది. అన్నాళ్లు హైదరాబాదే మనకు రాజధానిగా ఉండేది. అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరించి, అభివృద్ధిని వికేంద్రీకరిద్దామని చెప్పాం. ఇది సాద్యమైందా? వలసలు ఎవరైనా ఆపగలిగారా? రాయలసీమలో బీడు భూములను పంట భూములుగా మార్చే ప్రయత్నాలు ఎంతవరకు సఫలికృతమైంది. రాష్ట్రంలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ మాటలు చెప్పుకోవడానికి బాగున్నాయే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదు.

గత ఐదేళ్లలో అభివృద్ధిని బ్రహ్మండంగా వికేంద్రీకరించామని చంద్రబాబు చెబుతుంటే నవ్వు వస్తుంది. 2018లో చంద్రబాబు ఒక బుక్‌ రిలీజ్ చేశారు. అందులో చిట్టచివరి స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పోటీపడుతున్నాయి. జీడీపీలో 3 శాతం మాత్రమే ఉంది. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది. ఇలాంటి పరిస్థితిలో మాటల్లో కాదు..చేతల్లో చూపించాలని సీఎం వైయస్‌ జగన్‌ మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు.  అధికార కేంద్రాలను సైతం వికేంద్రీకరిస్తే తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని ఒక గొప్ప సాహసోపేత నిర్ణయానికి ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ వచ్చారు. మొన్ననే రేషన్‌కు సంబంధించి పోర్టబులిటీపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా వలస వెళ్లిన కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో నివాసం చేస్తుంటే అక్కడే రేషన్‌ తీసుకోవచ్చు. మన రాష్ట్రానికి సంబంధించిన డేటాను ఇటీవల పబ్లిష్ చేశాం. గుంటూరు, ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు రేషన్‌ తీసుకుంటున్న వారు ఒక్కో జిల్లాలో 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాను పరిశీలిస్తే..ఇతర జిల్లాల నుంచి వచ్చి రేషన్‌ తీసుకునేవారు 7 వేల మంది ఉన్నారు. విజయనగరంలో 60 వేల మంది ఉన్నారు. ఏమిటీ వ్యత్యాసం. ఇతర జిల్లాల్లో రేషన్‌ తీసుకుంటున్న వారందరూ ఎవరూ? ..వారంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారే. కుటుంబాలను విడిచిపెట్టి, బతుకులను విడిచిపెట్టి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తరువాత రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. వీటన్నింటిని కులంకుశంగా చర్చిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయగలం.

ఇలాంటి పరిస్థితుల్లో జీఎన్‌ రావు కమిటీ తరువాత నిన్న బీసీజీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ కమిటీ ప్రెస్టేజీయస్‌ కన్సల్టెన్సీ. అంతర్జాతీయంగా పని చేసింది. గతంలో చంద్రబాబుతో కలిసి పని చేసింది. నీతి అయోగ్‌, డీ మానిటైజేషన్‌కు ఈ కమిటీ అడ్వైజర్‌గా ఉంది. చంద్రబాబు అనేక సందర్భాల్లో ఎంవోయూలు కుదిర్చిన కన్సల్టెన్సీ ఈ కమిటీ. అలాంటి కమిటీని వైయస్ జగన్‌ అధ్యాయం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చాలా విలువైన సమాచారం ఇచ్చింది. ఈ 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ఈ కమిటీ గుర్తించింది. 50 శాతంపైగా అగ్రికల్చర్‌ ప్రోడక్ట్‌ అంతా కూడా కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి వస్తుందని, 9 జిల్లాల్లో అగ్రికల్చర్‌ ప్రోడక్ట్‌ పెంచాల్సిన అవసరం ఉందని ఈ కమిటీ సూచించింది. రాయలసీమలో కేవలం 20 శాతం భూమి మాత్రమే  ఇరిగేటేడ్‌ ల్యాండ్ ఉందని,దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. అలాగే ఓ రోడ్డు మ్యాప్‌ను సూచించింది.

ఆరు స్పెషల్‌ కమిషనరేట్స్‌ పెట్టి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఒక కమిషనరేట్‌, ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి జిల్లాల్లో ఒక కమిషనరేట్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కింద కృష్ణా డెల్టాలో ఒక కమిషనరేట్‌, నెల్లూరు, ప్రకాశం సంబంధించి దక్షిణ కోసా కింద ఒక కమిషనరేట్‌, రాయలసీమలో చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాలను కలిపి ఈస్ట్‌ రాయలసీమగా, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిపి వెస్ట్‌ రాయలసీమ కింద మరో కమిషనరేట్‌ పెట్టి కొన్ని రేకమొండేషన్లు ఈ కమిటీ సూచించింది. ఆయా ప్రాంతాల్లో అనువైన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని బీసీజీ కమిటీ రెకమొండేషన్‌ చేసింది. అదే సమయంలో రాజధాని విషయంలో కూడా బ్రహ్మండమైన రెకమొండేషన్‌ చేసింది. ఇందులో రెండు ఆప్షన్లు ఇచ్చింది. విశాఖలో సె‌క్రటేరియట్‌ కట్టి  అన్ని విభాగాల హెచ్‌వోడీల కార్యాలయాలు అక్కడే కట్టించి, తాత్కాలికంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు అసెంబ్లీ భవనం కూడా కట్టమని కమిటీ సూచించింది. ఇప్పుడున్న అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రధానంగా ఉంచి లెజిస్లేటీవ్‌ యాక్టివిటిస్‌ అన్ని ఇక్కడే జరగాలని, అలాగే కర్నూలులో హైకోర్టుకట్టించి, మిగిలిన ఏరియాల్లో హైకోర్టు బెంచీలు పెట్టాలని చక్కనైన రెకమొండేషన్లు ఇచ్చి రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఈ కమిటీ ఆషామాషిగా ఇచ్చిన రిపోర్టు కాదు. మన రాష్ట్ర ఆర్థిక వనరులను సైతం అధ్యాయం చేసి సాధ్యాసాధ్యాలను వివరించింది. రాష్ట్రానికి ఉన్న అప్పు రూ.2.50 లక్షల కోట్లు, అలాగే  అమరావతిని నిర్మించాలనుకుంటే రూ.1.20 లక్షల కోట్లు అవసరం అవుతాయి. అమరావతిలోనే ఇంత డబ్బు రాబోయే ఐదారు ఏళ్లలో ఖర్చు చేస్తే..మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయి.

అసలు గ్రీన్ ఫీల్డ్‌ సిటీ నిర్మాణం అన్నది ఎక్కడా సక్సెస్‌ కాలేదు. సుమారు 30కి పైగా నగరాలను అధ్యాయనం చేసి ఆ డేటాను ఇచ్చారు. ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ నిర్మాణం చాలా డెలికెట్‌ లోకేషన్‌, ప్రకృతి వైఫరిత్యాలు సంభవించే ప్రాంతం. కాబట్టే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని కమిటీ సూచించింది. ఈ డబ్బులను ఇరిగేషన్‌కు ఖర్చు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పింది. పోలవరం, గోదావరి-పెన్నా అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంటి ప్రాజెక్టులకు ఖర్చు చేయండి. రాష్ట్రంలో తాగునీరు లేక కిడ్నీ లాంటి ప్రత్యేక రోగాలు వస్తున్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టమని కమిటీ సూచించింది. విద్యా, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ప్రజల జీవన పరిస్థితిని మెరుగుపరచాలని, మానవ వనరుల అభివృద్ధికి కృషి చేయాలని చాలా చక్కగా బీసీజీ కమిటీ రిపోర్టు ఇచ్చింది.
ఒకసారి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను, చంద్రబాబు పాలనను గుర్తు చేసుకోవాలి. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌ వల్లే  ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌లోనే పెట్టుబడులన్నీ పెట్టించి, ఐటీ రంగమంతా హైదరాబాద్‌లోనే పెట్టారు. దీని వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తి రాష్ట్ర విభజనకు దారి తీసింది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, మానవ వనరులశాఖకు చాలా నిధులు వెచ్చించారు. దాన్ని స్వర్ణ యుగము అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు పాలన, వైయస్‌ జగన్‌ పాలనను చూస్తే.. అయ్యా..చంద్రబాబు ఈ కోస్తాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలన్నది ఇప్పటి డిమాండు కాదు..ఇది చరిత్రాత్మక వేదన. శ్రీబాగ్‌ ఒడంబడిక మీద  అసలు మీకు నమ్మకం లేదా? అసలు మీ స్టాండ్‌ ఏంటి? చాలా గమ్మత్తు అయిన విషయం రాష్ట్రంలో చూస్తున్నాం.

రాయలసీమలోని టీడీపీ నేతలేమో మాకు కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని టీడీపీ నేతలు కూడా మా ప్రాంతానికి రాజధాని కావాలని, దీని వల్ల మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్నారు. నచ్చనిదంతా కేవలం చంద్రబాబుకు, ఆయన సొంత వర్గానికే. అసలు ఈ విషయంపై మీ వైఖరి ఏంటి?. మీరు చెప్పేదే నిజమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని టీడీపీ నాయకులపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అసలు వైజాగ్‌లో క్యాపిటల్‌ పెట్టడం మీకు ఇష్టమా? కాదా స్పష్టం చేయాలి. మీరు అభివృద్ధిని వికేంద్రీకరించారు. కేంద్ర సంస్థలను ఒక్కటైనా మీ హయాంలో శ్రీకాకుళం, విజయనగరంలో పెట్టారా?. ఎన్ని సంస్థలను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఎన్ని పరిశ్రమలను కేటాయించారు. మీరు తెచ్చిన అప్పులు వివిధ జిల్లాలకు కేపిటల్‌ ఖర్చుల కింద ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి. మా జిల్లాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. మీ హయాంలో ఎంత వలసలను నిరోధించగలిగారో చెప్పాలి. అసలు అమరావతిలో ఎందుకు పర్మినెంట్‌ బిల్డింగ్‌లు కట్టలేదు. ఎందుకు తాత్కాలిక భవనాలే నిర్మించారు?. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ అని ఒక పక్కన అంటున్నారు. లక్ష పది వేల కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని మీరే అంటున్నారు. ఇది ఎలా సాధ్యం. ఈ రోజు ప్రభుత్వం బ్రహ్మండమైన ఆలోచన చేస్తున్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ నీళ్లు, నిధులు, పరిపాలన ప్రతి దానిని కూడా వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. దీన్ని మనందరం కూడా అభినందించాలి. ముఖ్యంగా మీ పార్టీ నాయకులే దీన్ని స్వాగతించారు. చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు. అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులను వైయస్‌ జగన్‌, వైయస్‌ రాజశేఖరరెడ్డి బాధపెట్టలేదు. రైతుల్లో ఉన్న చిన్న చిన్న ఆందోళనలను టీడీపీ ఎన్‌క్యాష్‌ చేసుకొని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోంది. మేం ఉద్యమాలు చేయలేమా? ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలకు పురిటి గడ్డ. మాకు రాజధాని కావాలని ఉద్యమం చేయలేమా? మీలాగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు. ఆరోజు మీరు అమరావతిలో రాజధాని కడతామంటే వైయస్‌ జగన్‌ తనకు  ఇష్టం లేకపోయినా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టకూడదని  ఒప్పుకున్నారు. ఈ రోజు అక్కడ అమరావతే లేనప్పుడు..రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చినప్పుడు వైయస్‌ జగన్‌ ఈ రోజు ఒక సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఏ ప్రాంతం చూసినా ఆశతో, ఆనందంతో ఉంది. చంద్రబాబు, ఆయన కుటుంబం రోజుకో డ్రామా వేస్తూ, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతోంది. అలాగే ఈ రెండు కమిటీలను పరిశీలించడానికి ప్రభుత్వం హై పవర్‌ కమిటీ వేసింది.ఈ కమిటీ కూడా సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా రిపోర్టు ఇవ్వాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయాలని, అధికారాన్ని, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ సెలవు..

Back to Top