ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

సీఎం వైయస్‌ జగన్‌కు మా జిల్లావాసుల తరుఫున కృతజ్ఞతలు

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌ది

చంద్రబాబు చిన్నమెదడు చిట్లిపోయినట్లుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

కర్నూలు: ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమక్షంలో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమలు చేశారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కర్నూలు జిల్లా వాసుల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి సంక్షేమం కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనటువంటి 40 వాగ్దానాలను కూడా అమలు చేశారన్నారు. 

చంద్రబాబు హయాంలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, కన్నీళ్లు దిగమింగారని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి గుర్తుచేశారు. కర్నూలుకు వచ్చి 35 హామీలిచ్చిన చంద్రబాబు అందులో 3 కూడా నెరవేర్చలేదని, ఎన్నో రకాల తప్పుడు వాగ్దానాలతో ప్రజలను వంచించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ప్రజల చేత ఛీ కొట్టబడి ఘోరంగా ఓటమిపాలై ఇంటికే పరిమితమయ్యాడన్నారు.  

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిదని, 2004–05లో 11 వేల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారని గుర్తచేశారు. ఈ రోజున పోతిరెడ్డిపాడు ద్వారా 6 జిల్లాలకు నీరందుతుందని, రైతాంగం సుభిక్షంగా ఉన్నారు. ఈ సమయంలో పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మెదడు చిట్లిపోయినట్టుందని, అందుకే శ్రీశైలం డ్యామ్‌ నేనే కట్టాను.. పోతిరెడ్డిపాడు నేనే కట్టాను.. చార్మినార్‌ నేనే కట్టాను అని చెప్పుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయాడన్నారు. పోతిరెడ్డిపాడు 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన మహనీయుడు వైయస్‌ఆర్‌ అని గుర్తుచేశారు.  
 

Back to Top