ఎన్ఆర్ఐ, భూస్వాములు, పెత్తందార్లకు టీడీపీ పార్టీ టిక్కెట్లు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శంకరనారాయణ

అనంత‌పురం: ఎన్ఆర్ఐ, భూస్వాములు, పెత్తందార్లకు టీడీపీ పార్టీ టిక్కెట్లు కేటాయించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే శంకరనారాయణ విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీడీపీ నాయకుల ప్రవర్తన ఉందన్నారు. మహిళ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా టీడీపీ నాయకుల చర్యలున్నాయన్నారు. టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టిన.. మహిళలు అంతా వైయ‌స్ఆర్‌సీపీ  పక్షాన ఉన్నారన్నారు. కేశవ్ ఎన్ని జిమ్మికులు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరని, నియోజకవర్గ ప్రాంత సమస్యలు పట్ల స్పందించిన దాఖాలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజుల నుంచి ఓటర్లకు తాయీలాలు ఇస్తూ ప్రలోభాల పెట్టే ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయబోతున్నామన్నారు. ఎంత మంది కలిసి వచ్చిన వైయ‌స్‌ జగన్‌ను అడ్డుకోలేరని ఆయన అన్నారు.

ప్రజలు అన్ని గమనిస్తున్నారని… అవసరమైతే చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని… గతంలో బీజేపీని తిట్టిన బాబు.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే శంక‌ర‌నారాయ‌ణ‌ వ్యాఖ్యానించారు.

Back to Top