టీడీపీ పాలనలో ఏపీ వెనుకంజ..

చంద్రబాబును రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు..

వైయస్‌ జగన్‌ పరిపాలనను గాడిలో పెడుతున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

అమరావతి:చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని జగ్గయ్యపేట వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మండిపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో ఏపీ వెనుకబడిపోయిందన్నారు.ఏపీని 2 లక్షల 50 కోట్ల అప్పులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారని తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వం 600 హామీలిచ్చి ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. వైయస్‌ జగన్‌ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుని హామీల అమలు దిశగా పనిచేస్తున్నారని తెలిపారు.మొదటి కేబినెట్‌లో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు హర్షనీయమన్నారు.సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన గాడిలో పెడతున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top