చంద్రబాబుదే నేర చరిత్ర

చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు

వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు

వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు

తిరుపతి: సొంత మామను వెన్నుపోటు పొడిచిన నేర చరిత్ర చంద్రబాబుదేనని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబుపై 18 కేసులు ఉన్నా  నేటికి విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లు చూశామని. యనమల రామకృష్ణుడు ప్రెస్‌మీట్‌ చూస్తే వారికి ఎంత అసహనం ఉందో అర్థమవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజాదరణతో జనసునామీ సృష్టిస్తుంటే ఓర్వలేక టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సినీ నటుడు నాగార్జున వచ్చి వైయస్‌ జగన్‌ను కలిస్తే ..ఒక నేరస్తుడిని ఎలా కలుస్తారని టీడీపీ నేతలు అంటున్నారని మండిపడ్డారు. నేర చరిత్ర ఉన్నది ఎవరికి అని ఆమె సూటిగా ప్రశ్నించారు. నేరారోపణలు, నేర చరిత్ర ఉన్న వారిని పక్కన పెట్టుకున్నది చంద్రబాబే అన్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన చంద్రబాబుది నేర చరిత్ర అని గుర్తు చేశారు. తమ తాత మరణానికి కారణమైన వారిని వదిలేసిన వారిది నేర చరిత్ర అన్నారు.

చంద్రబాబుకు ఎవరు ఎదురొచ్చినా కూడా రాజకీయంగా అడ్డుతొలగించుకుంటారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఇంట్లో బాంబులు పేలిన కోడెల శివప్రసాద్‌ను పక్కన పెట్టుకున్నది ఎవరూ? ఇంట్లో గన్నులు పేల్చిన బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్నది ఎవరని ప్రశ్నించారు. మంత్రులుగా ఉన్న వారు ఆడవాళ్లపై ఆఘాయిత్యాలు చేస్తున్న వారి జాబితాలో దేశంలోని టాప్‌ ఫోర్‌లో ఇద్దరు ఏపీకి చెందిన దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. నేర చరిత్ర ఉన్నవారిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో అందరికి తెలుసు అన్నారు. చింతమనేని లాంటి గుండాకు విప్‌ పదవి కట్టబెట్టి రాష్ట్రంపై వదిలేశారన్నారు. ఆయన మహిళా తహశీల్దార్‌ను కొట్టినా, ఫారెస్టు అధికారిపై దాడి చేసినా ..అంగన్‌వాడీ వర్కర్లను నీచాతి నీచంగా మాట్లాడినా..నిన్న దళితులను అసహ్యంగా అవమానించినా ఇంతవరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఎ్రరంనాయుడు, శంకర్‌రావులు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించారన్నారు. వైయస్‌ జగన్‌ ఏ తప్పు చేయలేదు కాబట్టే..ధైర్యంగా కోర్టుకు వెళ్తున్నారని, త్వరలోనే మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటి వరకు 18 కేసుల్లో స్టేలు తెచ్చుకోని ఇంతవరకు ఏ ఒక్క కేసుపై కోర్టులో విచారణకు వెళ్లలేదన్నారు. కోర్టుకు వెళ్తే జీవితాంతం జైల్లో ఉంటారన్న భయం చంద్రబాబును వెంటాడుతుందన్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top