మహానాడు తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు

ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

విజయవాడ: మహానాడులో చంద్రబాబు ప్రవేశపెడుతున్న తీర్మానాలు చూసి జనం నవ్వుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మహానాడు తీర్మానాలపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదవి కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తీర్మానం పెట్టడం సిగ్గుచేటన్నారు. గతంలో 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అందులో నలుగురిని మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయాన్ని బాబూ మర్చిపోయారా..? అని నిలదీశారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. రైతులకు, మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ చేసిన మేలు ఎవరూ చేయలేదని, ఏడాది పాలనలోనే రూ.10వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రశంసిస్తున్నారన్నారు. 
 

Back to Top