ఇళ్లు నిర్మిస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ మహిళలకు అన్న అయ్యాడు 

ఎమ్మెల్యే రోజా

 తిరుపతి: ఏపిలో 28 లక్షల గృహాలు మహిళల పేరు మంజూరు చేసి..ఇళ్లు నిర్మిస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ మహిళలకు అన్న అయ్యాడు అని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. శుక్ర‌వారం  ఉదయం వీఐపీ దర్శనంలో ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డిలు కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.  
 
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నాలుగు ఇళ్లు నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదే అన్నారు. రాష్ట్రంలో 31 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇళ్ల స్థ‌లాలు ఇచ్చి .. 4 లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించారని తెలిపారు. 50 శాతానికి పైగా నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించారు.. దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచారు అని ఎమ్మెల్యే రోజా తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top