ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం మాది

 ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

అమ‌రావ‌తి:  ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం మాది అని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. పది రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలని అన్నారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వం అంటే ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వమని, ఇప్పటికే తమ సోదరి సమానురాలైన హోమ్ మంత్రి సుచరిత స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారని చెప్పారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top