రాజన్న రాజ్యం దిశగా వైయస్‌ జగన్‌ అడుగులు

ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి(రాజన్న) రాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. శాసన సభా పక్ష సమావేశం అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పిస్తామని వైయస్‌ జగన్‌ చెప్పినట్లు రోజా తెలిపారు. వైయస్‌ జగన్‌ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top