వైయస్‌ జగన్‌తోనే మహిళలకు రక్షణ

టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు

అక్కాచెల్లెళ్లందరూ చంద్రబాబును తరిమికొట్టాలి

నమ్మించి దగా చేసిన చంద్రబాబుకు బుద్ధిచెప్పాలి

జననేతతోనే రాష్ట్రంలో స్వర్ణయుగం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

విశాఖ జిల్లా: బీజేపీ నుంచి చంద్రబాబు బయటకు వస్తే రైల్వే జోన్‌ వచ్చిందని, ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు వెళ్ళిపోతే ప్రత్యేకహోదా కూడా వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో వైయస్‌ఆర్‌సీపీ మహిళా గర్జనలో ఆమె  మాట్లాడారు. ప్రత్యేకహోదా వచ్చేవిధంగా రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరూ చంద్రబాబును తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.2014 ఎన్నికలో మహిళలకు మాయా మాటలు చెప్పి..వారి ఓట్లు దండుకున్న చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని మండిపడ్డారు.ఆరేళ్ల బాలిక నుంచి ఆరవై ఏళ్ల వృద్ధుల వరుకు రక్షణ లేకుండా పోయిందన్నారు.బాలికలపై టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అత్యాచారాలు చేస్తున్నా..వారిపై చర్యలు తీసుకోకుండా నేరస్తులకు అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు.మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న  చంద్రబాబుకు  మహిళలు బుద్ధిచెప్పాలన్నారు.

చంద్రబాబు మాటలు నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను అప్పులోకి నెట్టారని దుయ్యబట్టారు. 14 వందల కోట్ల అప్పు ఉంటే..ఐదు సంవత్సరాలలో 22 వేల కోట్లకు చేరిందని ధ్వజమెత్తారు.మహిళలను అన్నిరకాలుగా మోసంగా చేశారన్నారు.మళ్లీ ఎన్నికల సమీపించడంతో పసుపు–కుంకుమ అంటూ మళ్లీ మహిళలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.పసుపు–కుంకుమలు తుడిచేసే విధంగా పరిపాలిస్తూ చంద్రబాబు అన్న అని పిలవమనడం సిగ్గుచేటన్నారు.బ్యాంకుల్లో బంగారం  మీ ఇంటికి నడిచి వస్తుందని నమ్మించినందుకు అన్న అని పిలవాలా..,రోడ్డుకోక బెల్టుషాపు, వీధికోక బారు పెట్టి..మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు అన్న అని పిలవాలా..? మహిళలను జుట్టు పట్టుకుని లాక్కుని పోయి ఇసుకలో వేసి తన ఎమ్మెల్యే  కొట్టినందుకు అన్న అని పిలవాలా..? ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి  పథకం కింద 30వేలు వేస్తానని చెప్పి..ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కూడా వేయకుండా మోసం చేసినందుకు అన్న అని పిలవాలా..? నారాయణ కాలేజిలో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే..యాజమాని నారాయణను కాపాడుతూ..ఆడపిల్లల ప్రాణాలను చులకనగా చూస్తునందుకు అన్న అని పిలవాలా.. అని ప్రశ్నించారు.

అన్న అంటే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని,ప్రజా సంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకుంటూ..వారి కష్టాలను దూరం చేయాలని నవరత్నాలను తీసుకువచ్చారన్నారు.తల్లి తమ పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అమ్మఒడి పథకం కింద 15 వేలు ఇస్తానన్న ఆయనను అన్న అని పిలవాలన్నారు. ఆడపిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా మగపిల్లలతో సమానంగా  ఏ చదువైన చదిస్తానని చెప్పిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అన్నగా పిలవాలన్నారు.మద్యం వలన తాళిబొట్లు తెగిపోయే పరిస్థితులు వచ్చాయని,మహిళలు నష్టపోతున్నారని తెలుసుకుని..అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న వైయస్‌ జగన్‌ను అన్నగా పిలవాలన్నారు.ఆరోగ్యం బాగోలేకపోతే కులమతాలకు అతీతంగా..1000 రూపాయలకుపైగా వైద్యఖర్చు అయితే ఎంత బిల్లు అయినా ప్రభుత్వమే భరిస్తోంది అని చెప్పిన వైయస్‌ జగన్‌ను అన్న అని పిలవాలన్నారు.

రాష్ట్రంలో 25 లక్షల మంది మహిళలకు ఇళ్లు నిర్మించి..ఆస్తిగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పిన వైయస్‌ జగన్‌ను అన్నగా పిలవాలన్నారు.చంద్రబాబు ఊసరవెల్లిలా రంగలు మార్చడమే తప్ప ఈ రాష్ట్రానికి ఏ ఉపయోగం లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే..వైయస్‌ జగన్‌ ఎక్కడ పాదయాత్రలు,మహిళా గర్జనలు నిర్వహించిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైయస్‌ జగన్‌కు సంఘీభావం తెలియజేస్తున్నారన్నారు.రాబోయే రోజుల్లో ఆరు  నూరైనా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు.అమరావతికి జగన్‌ వ్యతిరేకి,ఆయన అధికారంలోకి వస్తే అమరావతిని రాయలసీమకు తరలించుకుపోతారని చెప్పి చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు బుద్ధి చెప్పేవిధంగా నిన్న వైయస్‌ఆర్‌ కుటుంబసభ్యులతో అందరికితో కలిసి గృహ ప్రవేశంతో పాటు, శాశ్వత  పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారన్నారు.రాష్ట్రంలో ఏ పార్టీ అధ్యకుడికి కూడా అమరావతిలో ఇల్లు లేదన్నారు.ఏ పార్టీకి కూడా శాశ్వతమైన కార్యాలయం లేదన్నారు.ఒక వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే ఉందంటే..రాబోయే కాలంలో రాష్ట్ర  ప్రజలకు శాశ్వత పరిపాలన ఇచ్చి..తన తండ్రి కలగన్న  విధంగా..ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం చూసేవిధంగా స్వర్ణాంధ్రను చేయడానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top