వైయస్‌ జగన్‌ అప్‌డేటెట్‌ వర్షన్‌..చంద్రబాబు ఔట్‌ డేటెడ్‌

రాష్ట్రానికి చంద్రబాబు ఎక్స్‌పైర్‌ టాబ్లెట్‌ లాంటివారు..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

పశ్చిమగోదావరి: 40  ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతుsన్న చంద్రబాబు 40 ఏళ్ల వైయస్‌ జగన్‌ ఆలోచనలు కాపీ కొడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్‌ చేస్తారు.వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు.

చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్‌పైర్‌ అయిన టాబ్లెట్‌ వంటి వారని, వైయస్‌ జగన్‌ అప్‌డేటెట్‌ వర్షన్‌ అయితే చంద్రబాబు ఔట్‌ డేటెడ్‌ వర్షన్‌ అని ఎద్దేవా చేశారు.బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు తనకొడుక్కి మాత్రం మంత్రి పదవి ఇప్పించారన్నారు.చంద్రబాబు పెంచిన పెన్షన్‌ 2 నెలలు మాత్రమే ఇస్తాడన్నారు. వైయస్‌ జగన్‌కు ఓటేస్తే జీవితాంతం ఇస్తారని తెలిపారు.

Back to Top