ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చిస్తే తప్పేమీటి...

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పోరాటం..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..

తిరుపతి: అధికారాన్ని ఎలా చేక్కించుకోవాలనే ఆలోచనే తప్ప రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే తలంపు చంద్రబాబుకు ఏకోశాన లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.వైయస్‌ జగన్‌పై కావాలనే బురదజల్లుతున్నారన్నారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసింది కాంగ్రెస్,టీడీపీలే అని దుయ్యబట్టారు.ఫెడరల్‌ ఫ్రంట్‌పై వైయస్‌ జగన్‌ను కేటీఆర్‌ కలిస్తే తప్పేమీటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాలు,హక్కుల కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. విశ్వసనీయత,భావ సారూప్యత కలిగిన ఉన్న పార్టీలు కలిసి పనిచేస్తే తప్పేమిటని అని అన్నారు.

పచ్చకామెర్లు వచ్చినవాడికిS లోకమంత పచ్చగా ఉంటుందనట్లుగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకుందామా..ఎప్పుడు ఎవరితో జత కలుద్దామా..ఎలా అధికారం చేజిక్కించుకుందామా అనే ఆలోచనే తప్ప మంచి కార్యక్రమాలు చేద్దాం..ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుద్దాం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించడానికి కేటీఆర్‌ వైయస్‌ జగన్‌ను కలిస్తే ఏపీకి జరుగుతున్న అన్యాయంగా టీడీపీ దుష్ఫ్రచారం చేస్తుందన్నారు.చంద్రబాబు నాయుడిలాగా చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకుని కేసులు మాఫీ చేసుకోలేదన్నారు.

చంద్రబాబు ఇయ్యంకుడు బాలకృష్ణ ఆయన లబ్ధి కోసం కేసీఆర్‌ను కలిశారు. అందరికి నీతులు చెప్పే పవన్‌ కల్యాణ్‌ కేసీఆర్‌ను కలిశారు.. అని ఎద్దేవా చేశారు..అమరావతి శిలాఫలకంపై కేసీఆర్‌ పేరు వేయలేదా..నాడు ఎందుకు కేసీఆర్‌ను ఆహ్వానించారు అని ప్రశ్నించారు.కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా.. కేసీఆర్‌ ఛీపొమ్మంటే తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. టీడీపీ వల్లే రైల్వేజోన్, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ రాకుండాపోయాయని ధ్వజమెత్తారు  వైయస్‌ జగన్‌ విశ్వసనీయతపై ప్రజలందరికి నమ్మకం ఉందన్నారు.

తాజా వీడియోలు

Back to Top