రాష్ట్ర ప్రయోజనాలే వైయస్‌ జగన్‌ లక్ష్యం..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...

వైయస్‌ఆర్‌ జిల్లా: కేటీఆర్‌ భేటి అయితే చంద్రబాబు,లోకేష్‌ వణికిపోతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కేటీఆర్‌తో వైయస్‌ జగన్‌ చర్చలు జరిపారని తెలిపారు. టీఆర్‌ఎస్‌తో చర్చించడమే తప్పంటున్న టీడీపీ నేతలు 2009లో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరు యంగ్‌ అంyŠ  డైనమిక్‌ లీడర్స్‌ కలిసి మాట్లాడుకోవడంతో టీడీపీ నేతల్లో వణకు పుడుతుందన్నారు.మొన్నటి వరుకూ పొత్తు కోసం కేసీఆర్‌ చుట్టూ ప్రదక్షిణలు చేసిన చంద్రబాబు.. నేడు కేటీఆర్‌తో వైయస్‌ జగన్‌ చర్చలు జరపడం కుట్ర అనడం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒంటరిగానే పోటీకి దిగుతారన్నారు. గతంలో కేసీఆర్‌ విజయవాడ కనకదురమ్మ గుడిలో మొక్కుతీర్చుకునే సమయంలో ఆయనకు సకల మర్యాదలు చేసినా  దేవినేని ఉమా.. నేడు జగన్‌మోహన్‌ రెడ్డితో కేటీఆర్‌ మాట్లాడటమే తప్పు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్,కేటీఆర్‌తో మాట్లాడటమే ఏపీకి చేసిన ద్రోహమయితే..అమరావతి రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్‌ను పిలవటమే కాకుండా శిలఫలకం  మీద కేసీఆర్‌ పేరు కూడా చెక్కించారు..ఆ రోజు మీరంతా గాడిదలు కాస్తున్నారా..ఎందుకు ప్రశ్నించలేదని టీడీపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్‌ మెప్పు కోసం చంద్రబాబు తన ఇంటిలో 36 రకాల వంటకాలు చేయించి దగ్గరుండి తినిపించారని గుర్తు చేశారు.

Back to Top