మోదీకి ఊడిగం చేస్తున్నది చంద్రబాబే 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో అన్నీ అనుమానాలే
 
ఎన్‌ఐఏకు అప్పగించడంలో ఎందుకు భయం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫినిష్‌ చేస్తామనడం దారుణం  

ఏపీలో వేల కోట్ల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు నమోదు కాలేదు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేల కోట్ల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు నమోదు కాలేదని, చంద్రబాబు బీజేపీకి, నరేంద్రమోదీకి ఊడిగం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. బీజేపీతో లాలూచీ పడటం వల్లే చంద్రబాబుపై కేసులు నమోదు కావడం లేదన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు బదలాయిస్తే ఎందుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎన్‌ఐఏకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడారు. 

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన తరువాత డీజీపీ గంట వ్యవధిలోనే ఎలా మాట్లాడారో, టీడీపీ మంత్రులంతా కూడా ఎలా వ్యవహరించారో అందరూ చూశారన్నారు. వైయస్‌ జగనే ఇలా చేయించుకున్నారని హేళనగా మాట్లాడారన్నారు. చట్టాలు ప్రజలకు తెలియవు కాబట్టి ఏం చేసినా నమ్మేస్తారన్న విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎయిర్‌పోర్టులో ఘటన జరిగితే వెంటనే కేసు నమోదు చేయించి కేంద్రానికి అప్పగించాలన్నారు. కేంద్రం వెంటనే ఎన్‌ఐఏకు బదలాయించాలన్నారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారు. ఇవాళ రాష్ట్రంలోకి సీబీఐ, ఐటీ వంటి సంస్థలు రాకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. హైకోర్టు తీర్పును కూడా ఈ ప్రభుత్వం గౌరవించడం లేదన్నారు. దావూద్‌ఇబ్రహీం, విజయమాల్య, ఆంధ్ర మాల్యాలను చంద్రబాబు కాపాడుతున్నట్లు హిట్లర్, నియంతలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారన్నారు. ఇలాంటి నేతనా మనం ముఖ్యమంత్రిని చేసింది అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు.

నిన్న కాకినాడలో ఓ మహిళా చంద్రబాబు చేసిన తప్పును ఎత్తి చూపితే ఫినిష్‌ చేస్తానని బెదిరించారన్నారు. ఇలాంటి మాటలు అసెంబ్లీలో ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. ఒక రౌడీ, గుండా మాదిరిగా మాట్లాడుతున్నారన్నారు. మేధావిలా ఆయన ప్రవర్తించడం లేదన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌ను చంపేస్తే మనకు సంబంధం ఉండదన్న కుట్రకోణంలో అక్కడ హత్యాయత్నం చేయించారన్నారు. ఈ కేసును ఎన్‌ఐఏకు బదలాయిస్తే ఎందకు టీడీపీ నాయకులు, పప్పు నాయుడు గిలగిలకొట్టుకుంటున్నారన్నారు. నిప్పునాయుడు, పప్పునాయుడు ఎవరు చేయించారో తెలిసి పోతుందన్నారు. ఆపరేషన్‌ గరుడ అన్న స్టోరీతో శివాజీతో కట్టుకథలు చెప్పించారని,  ఇంతవరకు ఆయన్ను విచారించలేదన్నారు. నేరస్తుడు చేసిన నేరాన్ని దాచి పెడుతున్నారన్నారు. పొడిచిన శ్రీనివాసుకు లేని బాధ చంద్రబాబు, లోకేష్‌కు వచ్చిదంటే అర్థమేంటన్నారు. చంద్రబాబు బినామీ హర్షవర్ధన్‌ క్యాంటీన్‌ కావడం కాబట్టే అన్నారు. వీటన్నింటికి కారణం తండ్రి,కొడుకులదే అన్నారు.

బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది చంద్రబాబే అన్నారు. ప్రతిసారి బీజేపీతో లబ్ధిపొంది..ఆ తరువాత విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడి సతీమణిని నియమించారన్నారు. నీతిఅయోగ్‌ సమావేశంలో ప్రధానికి వంగి వంగి దండాలు చేసింది చంద్రబాబే అన్నారు. బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌టీఆర్‌ బయోపిక్‌కు క్లాప్‌ కొట్టింది వెంకయ్యనాయుడు కదా అన్నారు. ఈ రోజు రాజధాని, పోలవరం, పట్టిసీమ, నీరు–మీరు కార్యక్రమాల్లో విఫరీతమైన అవినీతి జరుగుతున్నా  ఇంతవరకు ఒక్క కేసు నమోదు కాలేదంటే బీజేపీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేయడం లేదన్నారు. నీచంగా అధికారం కోసం గాడిద కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబే అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై వైయస్‌ జగన్‌తో కేసులు పెట్టింది చంద్రబాబే అన్నారు.

తన సొంత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్యచేస్తే ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది కుట్ర కాదా అన్నారు. వైయస్‌ జగన్‌ కేసు ఎన్‌ఐఏకు అప్పగిస్తే కుట్ర ఎందుకైందని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న శాంతిభద్రతలపై నమ్మకం లేక కేంద్ర ప్రభుత్వం పెట్టిన సెక్యూరిటీని ఎందుకు ఉపయోగించుకుంటున్నారని ప్రశ్నించారు.
ఎన్‌ఐఏకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని చెప్పడంలో అర్థమేంటని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. కుట్ర వెనుక ఎవరు ఉన్నారో అందరిని బయటకు లాగాన్నారు.
అసెంబ్లీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 23 మందిని టీడీపీలో చేర్చుకున్నారని, వారిని సస్పెండ్‌ చేయకుండా స్పీకర్‌ కాపాడుతున్నారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచారన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2017 నవంబర్‌ 6వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందన్నారు. దాదాపు 150 నియోజకవర్గాల్లో ప్రజలందరిని నేరుగా కలుసుకొని, వారి సమస్యలను, ప్రాంతాల వారిగా ఉన్న సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఎక్కడిక్కడే నిలదీస్తూ ముందుకు సాగారన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ..చేయని పనులను చేసినట్లు గ్రాఫిక్స్‌లో చూపిస్తున్న చంద్రబాబును శిక్షించాలని ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రాదని భావించి వైయస్‌ జగన్‌ను భౌతికంగా లేకుండా చేశారన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు సీబీఐ, సీడీ, సీబీసీ కత్తులు వారి గొంతులపై ఉన్నాయన్నారు. ఇలాంటి వారిని శిక్షించకపోతే చాలా ప్రమాదం ఉందన్నారు. కోడికత్తి అంటూ హేళన చేస్తున్న చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఈ భయంతోనే బీజేపీతో వైయస్‌ జగన్‌ కలిశారని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. కచ్చితంగా తప్పు చేసిన వారు బయటకు వస్తారన్నారు. ఎన్‌ఐఏ అందరిని విచారించాలన్నారు. 

 

Back to Top