పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు

బాబు పాలనలో రాజకీయాలు దరిద్రంగా మారాయి

గ్రామస్థాయిలో ఉన్న ఫ్యాక్షన్‌ రాష్ట్రస్థాయికి చేర్చారు

అవినీతి చంద్రబాబుకు త్వరలో జైలుశిక్ష ఖాయం

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: పాదయాత్రను విఫలం చేయాలని టీడీపీ నేతలు అనేక కుట్రలు చేశారని, వాటన్నింటిని అధిగమించి ప్రజా సంకల్పయాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దిగ్విజయంగా పూర్తి చేశారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక జిల్లాకు మించి మరో జిల్లాలో వేలాదిగా ప్రజలు తరలివచ్చి వైయస్‌ జగన్‌ అడుగులో అడుగులు వేశారన్నారు. కోట్లాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లోని బ్రిడ్జి దద్దరిల్లేలా జనం తరలివచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌ భాషాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక విశాఖ ఎయిర్‌పోర్టును ఎంపిక చేసుకొని హత్య చేయాలని కుట్ర చేశారన్నారు. ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలతో వైయస్‌ జగన్‌ తృటిలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారన్నారు. 

రాష్ట్ర రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యాయో వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నమే నిదర్శనమని రవీంద్రనాథ్ర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్‌ రాష్ట్ర స్థాయికి చేరిందన్నారు. ఇవన్నీ అధిగమించి దేవుడి అనుగ్రహం, ప్రజల ఆశీర్వాదంతో ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. కడపలో పెద్ద దర్గాను దర్శించుకున్న అనంతరం వైయస్‌ జగన్‌ పులివెందుల చేరుకుంటారని, అక్కడ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తారని చెప్పారు. 

చంద్రబాబు నాయుడి లాంటి వ్యక్తి ముస్లిం కంట్రీస్‌లో ఉంటే రోడ్డు మీదే ఉరి తీసేశారని, భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్ని తప్పులు చేసినా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రక్షించబడుతున్నాడని రవీంద్రనాథ్ర్‌రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మినే నెలల కాలంలో ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు ఒక్కటీ లేవన్నారు. లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నాడని, ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నేతలను చొక్కాలు పుట్టుకొని నిలదీసే పరిస్థితి తొందరలోనే తప్పకుండా వస్తుందన్నారు. ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అంతేకాకుండా చేసిన అవినీతికి జైలుశిక్ష అనుభవించడం కూడా ఖాయమన్నారు. పాదయాత్ర పూర్తి చేసుకొని కడపకు వచ్చిన వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు అవాకులు పేలుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

 

Back to Top