ఓటమిని జీర్ణించుకోలేకే వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్దికి టీడీపీ అరాచకాలు

సీఎం,హోంమంత్రిపై దుష్ప్రచారం అత్యంత దారుణం

డీజీపీకి  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు

అమరావతిః ఏపీలో టీడీపీ తన కిరాయి మనుషులతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని.. వ్యూహాత్మకంగా ఆ దాడులను వైయస్‌ఆర్‌సీపీపై నెట్టే యత్నం చేస్తున్నారన్నారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక మా పార్టీ శ్రేణులపై టీడీపీ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారని తెలిపారు.

సోషల్‌ మీడియాలోనూ సీఎం,హోంమంత్రిలపై అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్నారు.చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్‌లు ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా మాపై అక్కసుతో వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు టీడీపీ ఇటువంటి ఆరాచకాలు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

 

Back to Top