‘హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైయ‌స్‌ జగన్‌’

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్న దొర
 

విజయనగరం : ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్న దొర అన్నారు.  సోమవారమిక్కడ విలేరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దొంగదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నిలకు ముందు ఓట్ల కోసమే బాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత డబ్బునో, పార్టీ డబ్బునో కాకుండా ప్రజాధనాన్ని దొంగ దీక్షలకు ఉపయోగించడమేమిటని ప్రశ్నించారు.
 
నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకొంటున్న చంద్రబాబు.. నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన పథకాలు కాపీ కొట్టడం హాస్యాస్పదమని రాజన్న దొర ఎద్దేవా చేశారు. సర్వేల పేరిట వైయ‌స్ఆర్‌ సీపీ మద్దతుదారులను భయాందోళనకు గురిచేసి, ప్రలోభపెట్టే కార్యక్రమంలో చంద్రబాబు మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Back to Top