రైతు సంతోషంగా ఉండాల‌నేది సీఎం ల‌క్ష్యం 

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి

అసెంబ్లీ: రైతు సంతోషంగా ఉంటే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంద‌ని న‌మ్మిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి అన్నారు. రైతు మేలు కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌న్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి మాట్లాడుతూ.. రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా రైతుల‌కు పెట్టుబ‌డిసాయం రూ.13500 అంద‌జేశార‌న్నారు. కౌలు రైతుకు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌జేసిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ద‌న్నారు. అదే విధంగా రూ.2164 కోట్లతో 56 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పంట బీమా ప్రీమియం చెల్లించ‌డం జ‌రిగింద‌న్నారు. వ‌డ్డీలేని రుణాల‌ను రూ.2 వేల కోట్లు ప్ర‌భుత్వం భ‌రించింద‌ని, ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి  ద్వారా 2018లో ర‌బీలో శ‌న‌గ పంట న‌ష్ట‌పోయిన రైతుల కుటుంబాల‌కు రూ.45 వేలు ఇచ్చార‌న్నారు. 

 

గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాల్లో వేలాది కోట్ల రూపాయ‌లు నీరు - చెట్టు కార్య‌క్ర‌మంలో తెలుగు త‌మ్ముళ్లు దోచుకొని తిన‌లేదా..? అది కేంద్ర ప్ర‌భుత్వ డ‌బ్బా.. లేక ఆంధ్ర‌ప్ర‌దేశ్ డ‌బ్బా..? అని ప్ర‌శ్నించారు. రైతు భ‌రోసాలో రూ.6 వేలు కేంద్ర నిధులు అని ప్ర‌తిపక్షం అంటుంద‌ని, బ‌డ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కేంద్ర నిధులు క‌లుపుకొని బ‌డ్జెట్ రూపొందిస్తామ‌ని తెలియ‌దా అని నిల‌దీశారు. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల్లో కేంద్ర నిధులను ఉప‌యోగించుకుంటున్నామ‌న్నారు.  అదేవిధంగా ఎన్టీఆర్ గృహ స‌ముదాయం ప‌థ‌కానికి ఎవ‌రి డ‌బ్బు ఉప‌యోగించారు.. రాష్ట్రానిదా.. కేంద్రనిదా..? దీనికి స‌మాధానం చెప్పాల‌న్నారు.  చంద్ర‌న్న‌బాట‌, పెన్ష‌న్లు,  ప్ర‌తి ఒక్క‌దాంట్లో కేంద్ర నిధులు ఉన్నాయ‌న్నారు. కానీ పేరు మాత్రం చంద్ర‌న్న పేరు పెట్టుకున్నాడ‌ని ఎద్దేవా చేశారు. 

  

రైతుల‌కు అన్ని ర‌కాలుగా మేలు జ‌ర‌గాలి. 2014 ఎన్నిక‌ల్లో ఎటువంటి హామీలు ఇచ్చారు. రైతుల‌కు సంబంధించి రుణ‌మాఫీ చేస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఎంత‌మేర‌కు రైతుల‌కు న్యాయం చేశారు. రూ.87 వేల కోట్లు రైతుల బ‌కాయిలు.. దాన్ని నీరుగార్చి రూ.24 వేల కోట్ల‌కు కుదించారు. అది కూడా ఇవ్వలేదు. రైతు సాధికారిత సంస్థ‌, రుణ ఉప‌శ‌మ‌న అర్హ‌త ప‌త్రం. ఒక రైతుకు రూ.1.29 ల‌క్ష‌లు ఇస్తాన‌ని రుణ‌ప‌త్రం ఇచ్చాడు. ఇలాంటి కాగితాలు కొన్ని ల‌క్ష‌ల ప‌త్రాలు ఉన్నాయి. వీటిని వాళ్లు ఏం చేసుకోవాలో చెప్పాలి. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఐదేళ్ల‌లోనే పూర్తిచేయాలి. త‌రువాతి ప్ర‌భుత్వాలు ఇస్తాయ‌ని చెబుతారా..? 

 

ఉల్లి ధ‌ర‌లు అని నిన్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, స‌భ్యులు దండ‌లు వేసుకున్నార‌ని, ఉల్లి స‌మ‌స్య దేశ వ్యాప్తంగా ఉంద‌ని తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా.. మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉల్లి పంట తీసేందుకు, క్లీన్ చేసేందుకు, ట్రాన్స్‌పోర్టుకు ధ‌ర లేద‌ని పొలంలోనే వ‌దిలేశార‌ని గుర్తు చేశారు. అదే విధంగా ట‌మాటా పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక‌ ప‌శువుల‌కు వ‌దిలేశామ‌న్నారు. ఐదేళ్లు పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌లేని చంద్ర‌బాబుకు ఈ రోజు ఉల్లి గురించి మాట్లాడే హ‌క్కు ఉందా..? అని ప్ర‌శ్నించారు. 

 

2014 నుంచి 19 వ‌ర‌కు ఎంత‌మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. టీడీపీ ఆ రైతు కుటుంబాల‌కు ఎంత ప‌రిహారం ఇచ్చింద‌ని ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. 2014 నుంచి చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు ప‌రిహారంగా రూ.7 ల‌క్ష‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఇవ్వ‌బోతున్నార‌ని చెప్పారు. అదే విధంగా గ‌తేడాది సేక‌రించిన ధాన్యానికి సంబంధించి రైతుల‌కు టీడీపీ స‌ర్కార్ డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని, ఆ డ‌బ్బును కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రూ.960 కోట్లు చెల్లించార‌ని చెప్పారు. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వం 50 శాతం స‌బ్సిడీతో మంచి ర‌కాల విత్త‌నాల‌ను అందిస్తుంది. 149 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని, త‌ద్వారా స‌రైన విత్త‌నాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ అన్ని ర‌కాలుగా రైతుకు మేలు జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.  

Read Also: తెలంగాణాలో కేజీ ఉల్లి రూ.45  

తాజా వీడియోలు

Back to Top