బాబు మోసాలను ఎండగడదాం

నవరత్నాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలి

ప్రజలు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేయండి

మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం స్థాపించుకుందాం

యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై కేసులు బనాయించేందుకు టీడీపీ కుట్ర

నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయనగరం: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేస్తున్న చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, నియోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, శంబంగి చిన అప్పలనాయుడు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. 

పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాలుగున్నరేళ్లకు పైగా పోరాడుతున్నామని, పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోయారని, మరోసారి వంచనకు గురికాకుండా చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామ వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. మరో రెండు నెలల్లో రాజన్న రాజ్యం తెచ్చుకుందామని కార్యకర్తలకు సూచించారు. 

అక్రమ కేసులు బనాయించేందుకు లిస్టు

విజయనగరం జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. టీడీపీ నేతల నుంచి పోలీసులకు లిస్టు వచ్చిందని, ఆ లిస్టు సీఐ నుంచి మండలాల్లోని ఎస్‌ఐలకు చేరిందన్నారు. ఎవరైతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారో, కీలకంగా వ్యవహరించే నాయకుల పేర్లు ఆ లిస్టులో ఉన్నాయన్నారు. వారిపై అక్రమంగా కేసులు బనాయించాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయన్నారు. కాబట్టి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మనం ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండి ఓటర్‌ లిస్టుపై దృష్టి సారించలేదని, ఓటర్‌ లిస్టులో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓట్లు 60 శాతం గల్లంతయ్యాయన్నారు. చాలా చోట్ల బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించాలని సూచించారు. 

 

Back to Top