చంద్రబాబువన్నీ ఎన్నికల స్టంట్లే...

అభివృద్ధి పేరుతో బూటకపు ప్రచారం..

జలహారతులంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...

విజయవాడ:  బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రత్యేకహోదాను పక్కనపెట్టిన చంద్రబాబు...  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలపక్షం అంటూ హడావుడి చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ  సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.చంద్రబాబును నమ్మేపరిస్థితి లేదని, అందుకే అఖిలపక్ష సమావేశానికి  దూరంగా ఉన్నామని  తెలిపారు.చంద్రబాబువన్నీ ఎన్నికల స్టంట్లే అని అన్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు తేడా ఉంటుందని, కపట నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబువన్నీ ఎన్నికల ముందు తూతుమంత్రంగా పనులు చేస్తారన్నారు. 

అనంతపురం జిల్లాకు పూర్తిస్థాయిలో కృష్ణా నీళ్లు రాలేదన్నారు. చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇచ్చామని పగ్రల్భాలు చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. జలహారతులంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే జిల్లా  సస్యశ్యామలం అవుతుందన్నారు.బూటకపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన పీడగా ఆయన అభివర్ణించారు.సుమారు ఆరువందల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పూటకో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు.

 

Back to Top