సంక్షేమం ప్రతీ గడపకు అందించడమే లక్ష్యం

అందుకే గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ

చిచ్చుపెట్టే విధంగా చంద్రబాబు, ఎల్లోమీడియా తీరు

ప్రజల్లోకి వచ్చే ముఖం లేక పప్పుబాబు ట్వీట్లకే పరిమితమయ్యాడు

చంద్రబాబు దోపిడీ మొత్తం బట్టబయలు అవుతుంది

రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 58 వేల కోట్లు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం వైయస్‌ జగన్‌ గాడిలో పెడుతున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

 

తాడేపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు అందాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దాదాపు లక్షా 27 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి సీఎం ముందుకువచ్చారన్నారు. అవినీతికి తావులేకుండా మార్కుల ఆధారంగా యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు భేష్‌ అన్నారు. యువతకు ఉద్యోగాలు రావడం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుగా ఆయన ప్రవర్తన కనిపిస్తుందని ఎమ్మెల్యే పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు. యువతను తప్పుదోవ పట్టించాలని ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గత ఐదు సంవత్సరాల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి టీడీపీ ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైనా డీఎస్సీ అనౌన్స్‌ చేసినా రకరకాల కారణాలతో దాన్ని పోస్టుపోన్‌ చేసుకుంటూ పోయారు. ఆ ఖాళీలు పూరించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవినీతికి తావు లేకుండా మార్కుల ఆధారంగా ఉద్యోగాలు వచ్చే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు నిర్వహిస్తే దానిపై చంద్రబాబు, ఆయన కొడుకు, టీడీపీ నాయకులు అక్కసు వెల్లగక్కుతున్నారు.

పరీక్షా ఫలితాల్లో బలహీనవర్గానికి చెందిన మహిళ టాపర్‌గా నిలబడింది. కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఒక చెల్లి టాపర్, ఒక సైకిల్‌ మెకానిక్‌ కుమారుడు, ఓ కౌలు రైతు కుమారుడు టాపర్లుగా నిలబడ్డారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధిస్తే చంద్రబాబు, ఎల్లో మీడియా దీనిపై చాలా కథలు అల్లుతున్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తుంటే చంద్రబాబుకు కళ్లు మండుతున్నాయి. సమాజంలో చిచ్చుపెట్టి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేలా ఎల్లోమీడియా కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. దాదాపు 20 లక్షల మంది యువతీయువకులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున గత దశాబ్దాల కాలంలో ఇంత మంది పరీక్షలు రాసిన దాఖలాలు లేవు. ఇంకా 20 లక్షల మంది యువతలో అనుమానాలు కలిగేట్లు పత్రికలు, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.

రివర్స్‌టెండరింగ్‌ ద్వారా అనుకూలమైన వారికి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు తీసుకువచ్చారని అనుమానాలు రేకెత్తించే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయంతో రూ. 58 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. అంటే చంద్రబాబు పోలవరం పేరు చెప్పి ఎంత దోచుకున్నారో ప్రజలకు ఆలోచన మొదలైంది. ఎల్లోమీడియా రాతలు అన్ని పిచ్చిరాతలు అని ప్రజలందరికీ అర్థం అయ్యాయి. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం రూ. 45 నుంచి రూ. 50 వేల కోట్ల టెండర్స్‌ చంద్రబాబు అగ్రిమెంట్‌ చేసుకున్నారంటే దాంట్లో ఎంత నష్టం జరిగిందో ప్రజలు ఆలోచించాలి. దాదాపు 9 వేల కోట్ల రూపాయలు అనుమానం లేకుండా దోపిడీ నిసిగ్గుగా జరిగిందని అర్థం అవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కించడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సహకరించకుండా కుట్రలు చేయడం ఎంత వరకు సమంజసం.

పప్పు బాబు, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఈ మధ్య ట్వీట్లు వేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు పప్పు, చంద్రబాబుకు ముఖం లేదు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో చంద్రబాబు దొంగ పనులన్నీ బట్టబయలు అవుతున్నాయి. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రతి గడపకు చేరాలని గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంత నిసిగ్గుగా మాట్లాడడం దుర్మార్గమని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top