ఐదు బిల్లులు ప్రవేశపెట్టడం అమోఘం

బలహీనవర్గాల తరుఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు

బీసీల గురించి ఆలోచించిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

చంద్రబాబు బీసీలు, దళితులను కించపరిచేలా మాట్లాడారు

అందుకే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి

 

 

అమరావతి: బలహీనవర్గాల శాశ్వత కమిషన్‌ ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణకు బలహీనవర్గాలన్నీ ధన్యవాదాలు తెలుపుతున్నాయని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై సానుభూతి ఏ విధంగా అలవర్చుకున్నారో ఈ రోజుకి అర్థం కాలేదన్నారు. బలహీనవర్గాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే విధంగా ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలేతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పోల్చడానికి వెనకాడనని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. జ్యోతిరావుపూలే ఏ ఆశయాల కోసం పోరాడారో.. వాటి సాధన కోసం సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. బలహీనవర్గాల జీవితాలు మెరుగపడాలని ఐదు బిల్లులు ప్రవేశపెట్టడం అమోఘమన్నారు. 

చంద్రబాబు లాంటి వ్యక్తుల మూలంగా బీసీలు అట్టడుగుకు అణచివేయబడ్డారన్నారు. కేవలం పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అభివృద్ధి చేయడానికి గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తోలు తీస్తాను. తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు మాట్లాడరని ఎమ్మెల్యే పార్థసారథి గుర్తు చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని కించపరిచేలా మాట్లాడారంటే.. ఎంత కించపరిచే భావం చంద్రబాబుకు ఉందో ప్రజలంతా అర్థం చేసుకొని 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. చంద్రబాబుకు అవకాశం ఉంటే మేనిఫెస్టోలో మీరు ఏ కులంలో కావాలంటే ఆ కులంలో పుట్టేవిధంగా చేస్తానని హామీ ఇచ్చేవాడేమోనని అనుమానం కలుగుతుందన్నారు. దోచుకోవడం దాచుకోవడం కోసమే చంద్రబాబు పనిచేశారన్నారు. కులాలను కించపరిచే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాశ్వత ప్రాతిపదికన ప్రవేశపెట్టబడుతున్న ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నంత వరకు కమిషన్‌ ఉండే పరిస్థితి ఉంటుందన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top