వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా..

మదనపల్లె వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా

మదనపల్లె: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడున్నరేళ్లలోనే 98 శాతం నెరవేర్చిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇలాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో శాసనసభ్యుడిగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా అన్నారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైయస్‌ జగన్‌.. వారి కష్టాలను తీర్చేందుకు కేవలం రెండు పేజీల్లో మ్యానిఫెస్టోను రూపొందించి, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలను ముందుకు తీసుకెళ్తున్న దేశ చరిత్రలోనే ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. రూ.1.76 లక్షల కోట్లు మూడున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు అందజేశారన్నారు. మదనపల్లెలో ‘జగనన్న విద్యా దీవెన’ నగదు విడుదల బహిరంగ సభలో ఎమ్మెల్యే నవాజ్‌ బాషా పాల్గొని మాట్లాడారు. 

''ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. రూ.500 కోట్లతో మదనపల్లెకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేశారు. 2024లో డాక్టర్‌ చదవాలనుకునే మన పిల్లలందరికీ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 2004లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కరువు ప్రాంతమైన మదనపల్లె సస్యశ్యామలమైంది. 2019లో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ రాష్ట్రం తాగు, సాగునీటికి కరువు లేకుండా సస్యశ్యామలంగా ఉంది. ఎక్కడకెళ్లినా పచ్చదనం కనిపిస్తుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, కుప్పం వరకు హంద్రీనీవా కాల్వలను విస్తరిస్తూ 2500 కోట్ల అంచనాలతో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీరు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

రామసముద్రం–నిమ్మనపల్లె రోడ్డు రెండు లైన్లు చేయాలని ఎన్నో దశాబ్దాలుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేశారు. మదనపల్లె మున్సిపాలిటీకి రూ.38 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులు అతి తొందరలోనే ప్రారంభమవుతాయి. 

ఈ మూడున్నరేళ్లలో రామసముద్రం, నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల్లో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. పనులు జరుగుతున్నాయి. పీలేరు–మదనపల్లె ఫోర్‌ లైన్‌ పనులు రూ.1550 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. మదనపల్లె మున్సిపాలిటీలోనే దాదాపు 20 వేల ఇళ్లు మంజూరయ్యాయి. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో 10 వేల ఇళ్లు ఇచ్చాం. మొత్తంగా 30 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఎంతోమంది ముస్లిం పేద పిల్లలు పెద్ద స్థాయిలో ఉన్నారంటే.. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ మైనార్టీల పట్ల చూపించిన అభిమానం, ప్రేమ, ఆప్యాయతే కారణం. 4 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం ద్వారా మైనార్టీల్లో ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతస్థాయిలో ఉన్నారు.''

తాజా వీడియోలు

Back to Top