లోకేష్‌ ఆరోపణలపై సీఎం వైయస్‌ జగన్‌ను కలుస్తా

 సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని కోరతా

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి

నెల్లూరు:  టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని చేసిన ఆరోపణలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని కోరుతానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి తెలిపారు. లోకేష్‌ తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

మాది జమీందార్ల కుటుంబం..ఆ రోజుల్లో మాకు 16 వేల ఎకరాల భూమి ఉండేది. ఎన్టీఆర్‌ మా కుటుంబానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. మా నాన్నకు ఎన్టీఆర్‌ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆ రోజు చంద్రబాబే కదా ఎన్టీఆర్‌కు చాడీలు చెప్పించి మంత్రివర్గం నుంచి తీయించాడు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు ఎక్కడిది?. కుట్రలు, కుతంత్రాలు చేసి టీడీపీ నుంచి బయటకు పంపించిన వెధవ చంద్రబాబు.  మా నాన్న నిజాయితీగా, చిత్తశుద్ధితో టీడీపీలో పని చేశాడు. అలాంటి నాయకుడిని బయటకు పంపించారు. 
ఈ రోజు టీడీపీలో ఉన్న వారంతా ఎవరూ? ఎన్టీఆర్‌ అభిమానులందరిని పక్కన పెట్టారు. నీ సామాజిక వర్గం మాత్రమే టీడీపీలో ఉంది. లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రూ.17 వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. అందులో ఒక్క శాతం ఇవ్వండి చాలు. ఇలా వచ్చిన రూ.17 కోట్లు కూడా నా నియోజకవర్గంలో పేదలకు పంచిపెడతా..దమ్ముంటే ఆ డబ్బు ఎక్కడ ఉందో చూపించాలని నారా లోకేష్‌కు సవాలు చేశారు.

 

Back to Top