అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

ఎస్సీ, ఎస్టీ అభ్యున్న‌తి మండ‌లి స‌మావేశ నిర్ణ‌యాలు ఆనందానిచ్చాయి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌

విశాఖ‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో ద‌ళితులు సంతోషంగా ఉన్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్న‌తి మండ‌లి 6వ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యాలు ఆనందాన్నిచ్చాయ‌న్నారు. విశాఖ‌లో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు హయాంలో ద‌ళితుల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌న్నారు. చంద్ర‌బాబు ద‌ళిత వ్య‌తిరేకి అని, ద‌ళితుల ఓట్ల కోసం బూట‌పు హామీలిచ్చి గ‌త ఐదేళ్లు మోసం చేశాడ‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న అంబేడ్క‌ర్ ఆశ‌యాలకు అనుగుణంగా ఉంద‌ని మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి పెద్ద‌పీట వేశార‌న్నారు. అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందాల‌ని మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించార‌న్నారు. విశాఖ‌కు రాజ‌ధాని రాకుండా చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు త‌న తీరు మార్చుకోక‌పోతే టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌న్నారు.

Back to Top