వైయస్‌ఆర్‌ కుటుంబం వెంటే దళిత, గిరిజనులు

ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేరు వేరు కమిషన్లు తీసుకురావడం హర‌్షణీయం

వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు బావి తరాలకు దిక్సూచి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజించడం చారిత్రాత్మక నిర్ణయం

గత ఐదేళ్లలో దళితుల భూములు బలవంతంగా లాక్కున్నారు

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున 

అసెంబ్లీ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం దళిత, గిరిజనుల అభ్యున్నతికి పాటుపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. దళిత, గిరిజనులు వైయస్‌ఆర్‌ కుటుంబం వెంట నడవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  గత పాలనలో దళితుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. దళితులపై దాడులు, అసమానతలు ఉండేవి. దళితులు అంబేద్కర్‌ విగ్రహం పెట్టుకుంటామంటే గగరపర్రులో వెలివేశారు.  దళితుల భూములు భయపెట్టి లాక్కున్నారు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో టీడీపీ నాయకులు దళితుల భూములను లాక్కుంటే వైయస్‌ఆర్‌సీపీ అక్కడ ఉద్యమం చేయాల్సి వచ్చింది.  దళిత మహిళను వివస్త్రను చేసి కడుపులో తన్నారు. విశాఖ జిల్లా  పెందుర్తి నియోజకవర్గంలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే ప్రోదల్భంతో దళిత మహిళను వివస్త్రను చేశారు. మీ నియోజకవర్గంలో బహిరంగంగా ఓ దళిత మహిళను అచ్చెన్నాయుడు కడుపులో తన్నారు. ఈ కేసు ఇప్పటికీ ఉంది.  జోగిని వ్యవస్థ, రెండు గ్లాస్‌ల పద్ధతి అక్కడక్కడ కొనసాగుతున్నాయి. దళితులకు మనోధైర్యం కలిగించాలి. దళితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌కు తానే చైర్మన్‌గా పని చేశాను.దళితులు ఆ రోజు ధైర్యంగా గుండెపై చేతులు వేసుకొని బతికారు. టీడీపీ హయాంలో భయంతో బతకాల్సి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఉన్న కమిషన్‌ దళిత చట్టాలను రక్షించాల్సిన కమిషన్‌..నాడు భక్షించింది. వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చాలా దురదృష్టితో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. గిరిజన చట్టాలను రక్షించాలనే ఉద్దేశంతో కమిషన్‌ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన చట్టాలను రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను  ఈ రోజు విభజించాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నిశితంగా గమనించి ఇలాంటి చట్టాలు చేయలేదు. అణగారిన, బహుజనుల హక్కుల కోసం చట్ట సభల్లో ప్రత్యేక చట్టాలు చేసింది ఏపీ మాత్రమే. రాష్ట్రంలో  ఎస్సీ, ఎస్టీలను ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను చేశారు. నామినేటేడ్‌ పదవులు, పనుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరం. హోం మంత్రిని కూడా దళిత మహిళను చేయడం గొప్ప విషయం. మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబం పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతోంది. వైయస్ఆర్‌ బాటలో ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో భావి తరాలకు దిక్సూచి కాబోతున్నాయి. మాలాంటి దళిత, గిరిజనులు జీవితాంతం వైయస్ఆర్‌ కుటుంబం వెంట నడవాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు.  ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించే బిల్లు చారిత్రాత్మకం కాబోతోంది. ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాపాడేందుకు వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతోంది. రాజ్యాంగబద్ధంగా ఈ కమిషన్లు పని చేసేలా సీఎం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆలోచన విధానం విరాజిల్లుతోంది..అని చెప్పడానికి ఒక్క సెకన్‌ కూడా  ఆలోచన చేయడం లేదు. ఇలాంటి చట్టాలు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. 

 

Back to Top