అల్లూరి సీతారామరాజు జిల్లా: గిరిజన విద్యార్థుల బాగోగులు కూటమి ప్రభుత్వానికి పట్టవా అని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. పాడేరు నియోజకవర్గం గూడెం కొత్త వీధి మండలం జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి కలుషితమైన ఆహారం వల్ల సుమారు 50 మంది విద్యర్థులు అస్వస్థతకు గురయ్యారు, ఈ విషయం తెలుసుకున్న పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఇవాళ పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు పరామర్శించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గిరిజన పాఠశాలల్లో వరుస ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై మరణాలు చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కనీసం నోరుకూడా మెదపకపోవడం చాలా బాధాకరం అని అన్నారు, జర్రెల పాఠశాలలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే సంఘటన జరిగిన జిల్లా కలెక్టర్, పీవో, అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జగనన్న గోరు ముద్ద పథకం పెట్టి ప్రతి రోజూ మెను ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారం పెట్టి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా అడుగులు వేసారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నాణ్యతలేని ఆహారం పెట్టి విద్యార్థులు ప్రాణాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బోయిన కుమారి, మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్, మండల ఉపాధ్యక్షులు వంతాల అరుణ్ కుమార్, రీమేల బాలకృష్ణ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కంకిపాటి నారాయణ, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు లోచలీ వర ప్రసాద్,కార్యదర్శి మువ్వల చిన్నబ్బాయి, వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపాల రాజేష్, తదితరులు పాల్గొన్నారు,