ప్రజలు కోరుకునే  పాలనను సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్నారు

అన్నింటిలోనూ చంద్రబాబు అడ్డుపడుతున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ 7 నెలల పాలనపై త్వరలో శ్వేతపత్రం  

ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలు కోరుకునే పాలన అందిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు అన్నింటిలోనూ అడ్డుపడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ 7 నెలల పాలనపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. శనివారం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.  ఏడు నెలల కాలంలో  ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జనవరి 9న ప్రవేశపెట్టనున్న అమ్మ ఒడి పథకంతో అన్ని హామీలు పూర్తి అవుతాయన్నారు. గత చంద్రబాబు పాలనలో అసెంబ్లీలో ఎన్నికల హామీలు, ప్రజల గురించి చర్చించలేదన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ అధికారం చేపట్టాక సభలో 19 బిల్లులు ఆమోదం పెందాయని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు సభను స్తంభింపజేయాలని చంద్రబాబు చూశారన్నారు. దిశ చట్టంపై చర్చ జరగాలంటే ఉల్లి గురించి బాబు రాద్ధాంతం చేశారన్నారు. ఏపీలో ఉల్లి కొరత తీర్చిలే సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారని తెలిపారు.కేజీ ఉల్ఇ రూ.25లకే రైతు బజార్లలో అందుబాటులో ఉంచారని చెప్పారు.ఇంగ్లీష్‌ విద్య, అమ్మ ఒడి, నాడు-నేడు, రివర్స్‌ టెండరింగ్‌, అన్నింటిలోనూ చంద్రబాబు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని వివరించారు. నాడు-నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లకు రూ.3,500 కోట్లతొఓ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.  ప్రజలు కోరుకునే  పాలనను సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్నారని స్పష్టం చేశారు.  అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తన బాగాలేదని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో దిశ చట్టం నిలిచిపోతుందని పేర్కొన్నారు. త్వరలో సీఎం వైయస్‌ జగన్‌ 7 నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. 

Read Also: భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఆస్తి విద్య

Back to Top