స్థానిక ఎన్నికల ముసుగులో బాబు, నిమ్మగడ్డ కుట్రలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలిసి రాజకీయ కుట్రలు చేయాలని చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తీవ్రతను పట్టించుకోకుండా ఎన్నికలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 6 వేలకు పైగా మరణాలు సంభవించాయని చెప్పారు. ప్రభుత్వ సీఎస్‌ నీలం సాహ్ని రాష్ట్ర పరిస్థితులను వివరించినా ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కరోనా తీవ్రత ఉన్న సమయంలో ఎన్నికలను నిర్వహించాలనుకోవడం.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకోవడమేనని మండిపడ్డారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top