టీడీపీ,  బీజేపీ కలిసి వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం

ఆర్టీసీ టికెట్లపై చంద్రబాబు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు

ఇంకా బాబు సేవలోనే కొందరు ఆర్టీసీ అధికారులు ఉన్నారు

సీఎం వైయస్‌ జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం

రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరిస్తున్నారు

కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పాలన 

తాడేపల్లి: అన్యమత ప్రచారం పేరుతో ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తిరుమల బస్సు టికెట్లపై జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని ఆయన ఖండించారు. తిరుమల బస్సుల్లో ఈ ప్రకటనలకు అనుమతిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే అని గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు ట్విట్లు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో హిందూ మతానికి తీరని అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. 

ఈ రాష్ట్రంలో తెలుగు దేశం, ఎల్లోమీడియా కలిసి చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో హిందుధర్మానికి జరిగిన అవమానం ఎప్పుడు చూడలేదన్నారు. చంద్రబాబు హయాంలో అమ్మవారి దేవస్థానంలో క్షుద్రపూజలు చేశారు. శ్రీకళాహాస్తిలో క్షుద్రపూజలు చేశారన్నారు. ధర్మాగ్రహం పేరుతో అర్చకులు నడిరోడ్డుపై కూర్చొని ఆందోళన చేసింది చంద్రబాబు హయాంలోనే అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, దేవాదాయ మంత్రిగా మాణిక్యాలరావు ఉండగా పుష్కరాల్లో 29 మంది చనిపోయారన్నారు. టీడీపీ, బీజేపీలు నీచానికి వడికడుతున్నాయని, వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు అవసరమైన బిల్లులు శాసన సభ వేదికగా ఆమోదిస్తుంటే..బీజేపీ, టీడీపీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని వైయస్‌ జగన్‌పై హిందు వ్యతిరేకి అని ముద్ర వేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో చింతలేకుండా మీ అమ్మాయి పెళ్లి చేయండని ఆర్టీసీ టికెట్లపై ముద్రించారని, పవిత్ర హజ్‌ యాత్ర,దుల్హాన్‌ పథకాలపై ప్రచారం చేశారన్నారు. 5.03.2019న ఆర్టీసీకి సంబంధించిన టికెట్లపై మొత్తం చంద్రబాబుకు సంబంధించిన పథకాలపై ప్రచారం చేయాలని ఆర్డర్‌ కాపీలు విడుదల చేశారన్నారు. దీన్ని ఆధారం చేసుకొని ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై హజ్‌ యాత్ర, జెరుసలేమ్‌ యాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

మేం అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు మాత్రమే అయ్యిందన్నారు. కన్నాలక్ష్మీనారాయణ చేస్తున్న ట్విట్లకు అర్థంపర్థం లేదన్నారు. విజయవాడలో వంద ఆవులు చనిపోతే ప్రభుత్వానికి ఏం సంబంధమని, శ్రీశైలంలోని దేవదాయ దుకాణాల్లో అన్యమతస్తులు వేలంలో పాల్గొంటున్నారని పేర్కొంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కులం, మతం చూడకుండా పాలన చేస్తున్నామన్నారు.  బీజేపీ నేతలు చంద్రబాబు ట్రాప్‌లో పడి మాపై బుదర జల్లాలని చూస్తే..ఆది మీపైనే పడుతుందన్నారు. హిందు ధర్మానికి, దేవాలయాలకు దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే మంచి జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు హయాంలో హిందూ ధర్మం, సంప్రదాయాలు ఎక్కడా గౌరవించబడలేదన్నారు. వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై బుదర చల్లాలని ప్రయత్నం చేయడం మానుకోవాలని హితవు పలికారు. 
అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వైయస్‌ జగన్‌ మా వాడు అని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. ఇలాంటి వ్యక్తిపై హిందూ వ్యతిరేకి అని ముద్ర వేస్తున్నారని, ఈ మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

 

Back to Top