చంద్రబాబు టీమ్‌ గోబెల్స్‌ వారసులు

ప్రజలందరికీ మేలు చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

బాబు హయాంలో అవినీతిపై విచారణ జరిపించాలి

ఇసుక నుంచి మట్టి వరకు ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వెలగపూడి: చంద్రబాబు నాయకత్వంలోని టీమ్‌ గోబెల్స్‌కు వారసులని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకుండానే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను తప్పుదోవపట్టిస్తూ సభ ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇవ్వాలని ప్రతిపక్షాలు మొదలుపెట్టాయన్నారు. రుణమాఫీ అనే హామీతో గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మాపై రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌ మీటింగ్‌ ద్వారా పరిపాలన ప్రజలకు అర్థం అయ్యే విధంగా సందేశాన్ని పంపించారన్నారు.

40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోను, వైయస్‌ జగన్‌ మాటలను కాపీ కొట్టాడన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని 25 లక్షల ఇళ్లు కట్టించి మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబితే.. చంద్రబాబు కాకినాడలో మాట్లాడుతూ నేను కూడా ఉచితంగా ఇళ్లు ఇస్తానని ప్రకటించాడన్నారు. విజయవాడలో స్థలం లేకపోయినా 12 వేల ఇళ్ల అని చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని మోసం చేశారన్నారు. మైనార్టీలకు సంబంధించి వయస్సు తగ్గించి పెన్షన్‌ ఇస్తామంటే దాన్ని కూడా చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. పెన్షన్‌ రూ. 2 వేల హామీని కూడా చంద్రబాబు కాపీ కొట్టాడన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టాలనుకున్నారని, కానీ ప్రజలంతా గమనించి టీడీపీకి బుద్ధిచెప్పారన్నారు. 

ఒక పత్రికా యజమాని, ఒక సర్వే కంపెనీకి సంబంధించిన నాయకుడు, గత ప్రభుత్వం కలిసి తప్పుడు సర్వేలు చేసి ప్రజలను తప్పుదోవపట్టించారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో సైకిల్‌దే విజయమని తప్పుడు వార్తలు చెప్పించారని, ఆ కంపెనీకి చంద్రబాబు రూ. 1200 కోట్లు ఇస్తూ జీఓ కూడా విడుదల చేశారని, దీనిపై కూడా విచారణ చేయించాలన్నారు. తొలి సంతకాలకే చంద్రబాబు విలువ లేకుండా చేశారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా దుర్వినియోగం చేశారని, దానిపై కూడా విచారణ చేపట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇసుక మాఫియాపై ఈనాడు అనే పత్రికలో వివరంగా దానిపై విచారణ కూడా జరిపించలేదన్నారు. చంద్రబాబు నివాసం దగ్గర ఉన్న కృష్టానదిని కూడా దోచుకున్నారని, ఆఖరికి గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ రూ. వంద కోట్ల జరిమానా వేసిందంటే ఏరకంగా బాబు హయాంలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవాలన్నారు. కృష్ణానదిలో 30 మంది బోటు ప్రమాదంలో చనిపోతే కనీసం దానిపై మాట్లాడలేదని, పుష్కరాల్లో 30 మంది చనిపోతే మాట్లాడిన పాపాన పోలేదు. చంద్రబాబు కనుసన్నల్లోనే అవినీతి జరుగుతుంటే ఇతరుల మీద దాడి చేయడం తప్ప, వైయస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top