ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మాతృ వియోగం

నెల్లూరు: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతితో సంగం మండలం పడమటిపాలెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లి మృతిచెందారనే సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పడమటిపాలెంకు చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ ఆకస్మిక మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా సరళమ్మ మృతదేహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 

Back to Top