మీ ప్ర‌వ‌ర్త‌న‌తో మా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురావ‌ద్దు

ఎమ్మెల్యే  కోటం రెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి
 

అమ‌రావ‌తి:  టీడీపీ స‌భ్యులు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో మా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురావ‌ద్ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. స‌భ‌లో ఉన్న ప‌రిస్థితి చూస్తే బాధ‌గా ఉంది. సంతోషంగానూ ఉంది. సంతోషం దేనికంటే గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ప్ర‌తిప‌క్షానికి అవకాశం కల్పిస్తూ ప్ర‌జాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నామ‌ని తెలిపారు. ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలుగా ఉన్న‌ప్పుడు మాకు ఈ శాస‌న స‌భ‌లో అవ‌కాశాలివ్వ‌లా. అధ్య‌క్షా మైకు అంటూ అరవాల్సి వ‌చ్చేది. గ‌వ‌ర్న‌ర్ గారి వీడ్కోలు స‌భ‌లో న‌ర‌సింహ‌న్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్ర‌జ‌లంతా వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ఆనందంగా ఉన్నార‌ని చెప్పిన‌ట్లు తెలిపారు.  ఈ ప్ర‌భుత్వానికి మంచిపేరు రావ‌డం టీడీపీ చూసి త‌ట్టుకోలేక‌పోతోంది. ఓర్చుకోలేక చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నారు. ఒక‌ప్పుడు స‌భ‌లో ఖ‌బ‌డ్దార్ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుచిత వాఖ్య‌లు చేసి, చ‌ప్ప‌ట్లు చ‌రిచిన వాళ్లు ఇప్పుడూ అదే ప‌ద్ధ‌తిని కొన‌సాగిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top