ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ను వేరు చేయడం ద్వారా మేలు

కొరుమట్ల శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే
 

ఎస్సీ కమీషన్ ను రివైజ్ చేస్తూ ట్రైబల్ ట్రైడ్ ఆఫ్ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. స్వాగతిస్తున్నాం.
ఇందరాగాంధీ సివిల్ రైట్స్ పేరుతో ఉన్న చట్టానికి కొద్ది మార్పులు చేర్పులతో 1989 ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ గా చేసారు. గత ప్రభుత్వాలన్నీ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసారు. 2006లో రాజశేఖర రెడ్డి గారు  వేసిన ఎస్సీఎస్టీ కమీషన్లో నేను కూడా మెంబర్ గా ఉన్నాను. ఆ కమీషన్ ఇచ్చిన సిఫార్సుల అమలకు ఆయనే శ్రీకారం చుట్టారు. 1990లోనే ఎస్సీ, ఎస్టీ కమీషన్ ను డివైడ్ చేసారు. పాదయాత్రలో వైయస్ జగన్ గారు ఎస్సీ ఎస్టీల రక్షణకు ఉన్న చట్టాలు సరిగ్గా పనిచేయడం లేదని గ్రహించారు. ఎక్కడికేసులు అక్కడే ఉన్నాయని తెలుసుకున్నారు. పేరుకుపోతున్న కేసులు, డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయాల్సిన వాటిని కూడా ఎఎస్సైతోనో, ఎస్సైతోనో చేయించి తూతూమంత్రం చేయడం కూడా చూసారు. 90 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేయాలి. కానీ ఎక్కడా అలా జరగడం లేదు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమీషన్లను పదును పెట్టి, 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ను 30 రోజులకు కుదిస్తే బావుంటుందని సీఎం గారికి విజ్ఞప్తి  చేస్తున్నా. కమీషన్ ను డివైడ్ చేయడం ద్వారా పేరుకుపోయిన కేసులు త్వరగా పరిష్కారం అవుతాయి. కొండ ప్రాంతాల్లో, దూరంగా ఉండిపోయిన వారందరికీ ఈ కమీషన్ డివైడ్ చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. నవరత్నాల్లో అన్ని పథకాలు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు మేలు చేసేవే.  

   
Back to Top