అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది

అమరావతిలో రియల్‌ డెవలప్‌మెంట్‌పై సర్కార్‌ ఆలోచన

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని, అమరావతిలో రియల్‌ డెవలప్‌మెంట్‌పై సర్కార్‌ ఆలోచన చేస్తోందని, రాజధాని మీద పెట్టుబడి తగ్గించి రైతులకు కావాల్సిన ప్రాజెక్టులు, విద్యాభివృద్ధి, విద్యార్థులకు కావాల్సిన ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నట్లుగా అర్థం అవుతుందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికపై కృష్ణా, గుంటూరు జిల్లాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మీడియాతో ఏం మాట్లాడారంటే.. 

‘గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి రూ. లక్షా 10 వేల కోట్లు అవసరం ఉన్న పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు, విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాలకు, సంక్షేమ కార్యక్రమాలకు కావాల్సిన నిధులను, పరిగణలోకి తీసుకొని రాజధానికి రూ.లక్షా 10 వేల కోట్లు కావాల్సిన పరిస్థితుల్లో ఏం చేయాలనే సీఎం దృష్టికి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలను అభివృద్ధి చేయాలని ఆలోచన అర్థం అవుతుంది. రాజధాని మీద పెట్టుబడి తగ్గించి రైతులకు కావాల్సిన ప్రాజెక్టులు, విద్యాభివృద్ధి, విద్యార్థులకు కావాల్సిన ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నట్లుగా అర్థం అవుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న అభిప్రాయాలు, రాష్ట్ర రాజధాని అమరావతి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశ్రమలు, సాఫ్ట్‌ వేర్‌ హబ్‌ తీసుకురావడం, ఇతరత్రా సదుపాయాలు కల్పించి చంద్రబాబు చెప్పిన గ్రాఫిక్స్‌ కాకుండా.. రియల్‌ డెవలప్‌మెంట్‌ను.. రైతులు, రైతు కూలీలు, యువతీ, యువకులు సంతృప్తి పడేట్లుగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాజధాని నిర్ణయం తీసుకుంటే గనుక ఎటువంటివి తీసుకువస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దృష్టి కూడా పెట్టారు. కొత్తగా రైతాంగానికి కావాల్సిన ఇరిగేషన్‌ ప్రాజెక్టు వాటన్నింటినీ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందరికీ మేలు జరిగే విధంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో అభివృద్ధిలో అందరూ సంతృప్తి చెందేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా  అర్థం అవుతుంది. రైతులను సంతోషపెట్టే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. 

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికపై జరిగిన భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, సుచరిత, కొడాలి నాని, పేర్ని నాని, రంగనాథరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పార్థసారధి, అంబటి రాంబాబు, వసంత కృష్ణప్రసాద్, మేరుగ నాగార్జున ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు, విడదల రజిని, మేకా ప్రతాప్‌ అప్పారావు, శివకుమార్, ముస్తఫా, జోగి రమేష్, కిలారు రోశయ్య, మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, మర్రి రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు. 
 

Back to Top