చంద్రబాబు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటారు

కోటగట్ల వీరభద్రస్వామి
 

అమరావతి: నలభై ఏళ్ల అనుభవం అంటూ గొప్పలు చెప్పుకున్న వ్యక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. చంద్రబాబు శాశ్వతంగా ప్రతిపక్షానికే పరిమితమవుతారని ఆయన జోస్యం చెప్పారు. స్పీకర్‌ ధన్యవాద తీర్మాన సభలో కోలగట్ల మాట్లాడారు.  స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేనికి అభినందనలుతెలుపుతున్నాను. సభా స్థానంలో కూర్చున్న వ్యక్తి ఏవిధంగా ప్రవర్తించాలో మీకు కలిగి ఉంటుంది. మీరు కూర్చున్న స్థానానికి మరింత గౌరవం వచ్చేలా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సభలో అనేక మంది కొత్త సభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. ప్రజలు మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడుతారో..టీవీలో ఎప్పుడు చూడాలో అని ఎదురు చూస్తుంటారు. మాలాంటి కొత్త సభ్యులకు ట్రైనింగ్‌ క్లాస్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేదు.

వలసలు ఆగడం లేదు. చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో భవంతులు కూలిపోతే అందులో చనిపోయిన వారు ఏపీ ప్రజలే ఉంటున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మే 23న ప్రజలకు కలిగింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి యువకుడు, దమ్మున్న నాయకుడు, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు వైయస్‌ జగన్‌. యువకుల భుజస్కందాలపై దేశ భవిష్యత్తు ఆధారపడింది. వైయస్‌ జగన్‌పైనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఉంది. 2014 ఎన్నికల్లో తనకు అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన వ్యక్తులు రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అనుభవం ఉన్న వ్యక్తికి బుద్ధి చెప్పారు. స్పీకర్‌గా మీ విధులను ఆటంక పరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబుకు ప్రతిపక్ష స్థానం శాశ్వతం. దెయ్యాలు వేదాలు చెప్పినట్లు సభా సంప్రదాయాల గురించి అలాంటి నాయకులు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. సభా సాంప్రదాయాలు ఏవిధంగా ఉండాలో మా నాయకుడికి తెలుసు. వ్యక్తిని బట్టి సభకు గౌరవం రావాలి. మిమ్మల్ని స్పీకర్‌గా ఎన్నిక చేసినందుకు మా నాయకుడు వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు.

 

Back to Top